మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ చిన్న సర్జరీ చేయించుకొన్నట్టు సమాచారం. ఆయన కొంతకాలంగా మోకాలి సమస్యలతో బాధపడుతున్నారు. సరిగా నడవలేకపోతున్నారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం బాధని ఓర్చుకొని షూటింగ్ పూర్తి చేసినట్టు, ఇప్పుడు సర్జరీ చేయించుకొన్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని తెలుస్తోంది. ఈవారంలోనే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది. ఈ ఈవెంట్ కు చిరుతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొనబోతోంది. అక్కడ్నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలెట్టేస్తారు. చిరు కూడా మీడియా ముందుకు వస్తారని, ఇంటర్వ్యూలు ఇస్తారని సమాచారం అందుతోంది. అయితే ఈ సర్జరీకి సంబంధించిన విషయాలు చిరు టీమ్ గోప్యంగా ఉంచుతోంది. అధికారికంగా ప్రకటిస్తారా, లేదా అనేది చూడాలి.
మరోవైపు.. ‘మన శంకర వర ప్రసాద్’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. చిరు లుక్స్, గ్రేస్, కామెడీ టైమింగ్ బాగున్నాయని అభిమానులు మురిసిపోతున్నారు. ఈ సినిమా నుంచి మరో పాట రావాల్సివుంది. బహుశా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ పాటని విడుదల చేస్తారేమో చూడాలి. ఇది డాన్స్ నెంబర్ అని, చిరు స్టెప్స్ ఫ్యాన్స్ ని అలరించేలా ఉంటాయని తెలుస్తోంది. జనవరి 12న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వస్తున్న సంగతి తెలిసిందే. 11న ప్రీమియర్లు ప్రదర్శించే అవకాశం ఉంది.
