కథానాయికల్ని వెదికి పట్టుకోవడం గగనం అయిపోతోంది. చిన్న హీరోలకు ఈజీగానే దొరికేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గరకు వచ్చేసరికి మాత్రం హీరోయిన్లకు కరవొచ్చింది. చిరు. బాలయ్యల సినిమాల కోసం హీరోయిన్లను ఎంచుకొనే సరికి తలప్రాణం తోకకొచ్చింది. చిరు అయితే.. కాజల్ కి ఓటేయడానికి చాలా టైమ్ తీసుకొన్నాడు. ఇప్పుడు మరో సమస్య వచ్చింది. చిరు సినిమాకి ఓ ఐటెమ్ భామ కావాల్సివచ్చింది. అందుకోసం వినాయక్ అండ్ టీమ్ ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఐటెమ్ సాంగుల స్పెషలిస్టు. దేవి ఆల్బమ్ అంటే మసాలా పాట ఉండాల్సిందే. ఖైదీ నెం.150లో మసాలా పాటలకు అంతగా అవకాశం లేకపోయినా.. స్పెషల్ సాంగ్ అనే ఫీలింగ్ లేకుండా ఓ పాటని ట్యూన్ చేసి పెట్టాడట. దానికి అనువైన సందర్భమూ కుదిరింది. ఇప్పుడు ఐటెమ్ గాళ్ దొరికితే సరిపోతుంది.
ఓ స్టార్ హీరోయిన్‌తో ఆ పాట చేయిస్తే.. సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని చిత్రబృందం భావిస్తోంది. అందుకోసం తమన్నా పేరు కూడా పరిశీలిస్తున్నార్ట. కాల్షీట్లను బట్టి… ఐటెమ్ గాళ్ ఎవరన్నది నిర్ణయించుకొంటారు. ఒకవేళ తమన్నాతో పాటు ఏ స్టార్ హీరోయిన్ దొరకని పక్షంలో అప్పుడు హంసానందిని, కేథరిన్ లాంటి వాళ్లని తీసుకోవొచ్చని భావిస్తున్నార్ట. వాళ్లయితే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటారు కదా? కాబట్టి అన్నీ పాటలూ పూర్తయ్యాక ఆఖర్లో ఐటెమ్ సాంగ్‌ని షూట్ చేద్దామనుకొంటోంది చిత్రబృందం. తమన్నా ఓకే అంటే, కాల్షీట్లు దొరికితే.. తమ్మూతోనే ఐటెమ్ గీతం ఉండే అవకాశం ఉంది.