రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా విశ్వంభర టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.
”ఒకరి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో మిగిలి ఉన్న ఓ సమూహం తాలూకు నమ్మకం… అలసిపోని ఆశయానికి ఊపిరి పోసే వాడు వస్తాడని. ఆగని యుద్ధాన్ని యుగాలు పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురుచూసింది” – ఈ పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో సాగిన గ్లింప్స్ విశ్వంభర వరల్డ్‌ని పరిచయం చేసింది.
గ్లింప్స్ చివర్లో రక్షకుడిగా చిరు పరిచయం ఆకట్టుకుంది. ఓ కన్ను లాంటి యంత్రాన్ని చిరు చేతిలో పట్టుకున్న చివరి సన్నివేశం మరింత ఆసక్తిని పెంచింది. విజువల్స్, నేపథ్య సంగీతం బలంగా ఉన్నాయి. దర్శకుడు వశిష్ట, యూవీ నిర్మాతలు విజువల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని గ్లింప్స్ చెప్పకనే చెప్పింది. ఈ గ్లింప్స్ గ్రాఫిక్స్‌లో క్వాలిటీ కనిపించింది.
మొత్తానికి ఈ గ్లింప్స్ కథపై ఒక క్లారిటీ ఇచ్చింది. ఓ సమూహాన్ని రక్షించే రక్షకుడి పాత్రలో చిరు కనిపించబోతున్నారని స్పష్టమైంది. 2026 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.