చిరు బ‌ర్త్ డే గిఫ్ట్ అదే

ఈనెల 22 న చిరంజీవి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు కొత్త సినిమాకి సంబంధించిన టీజ‌రో, ఫ‌స్ట్ లుక్కో వ‌స్తుంద‌ని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాల్లో ఉంది చిత్ర‌బృందం. ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు, మోష‌న్ పోస్ట‌ర్ ని 22న సాయింత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమా కోసం `ఆచార్య‌` అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది. దాన్నేఖ‌రారు చేయొచ్చు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌. రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చ‌ర‌ణ్ కోసం మ‌రో క‌థానాయిక‌ని వెద‌కాల్సివుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్నారు. చిరు సినిమా అంటే మ‌ణి ప్ర‌త్యేక‌మైన బాణీలు స‌మ‌కూరుస్తుంటారు. బీజీఎమ్స్‌లోనూ.. మ‌ణి.. మాస్ట‌ర్‌. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కి ఎలాంటి బీజిఎమ్ అందిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

HOT NEWS

[X] Close
[X] Close