బిగ్ బాస్ స‌మంత‌.. ‘బిగ్’జోక్‌!

బిగ్ బాస్ కొత్త సీజ‌న్‌కి హోస్ట్ గా స‌మంత ని ఎంచుకున్న‌ట్టు… ఓ వార్త గ‌ట్టిగా షికారు చేస్తోంది. నిజానికి బిగ్ బాస్ 4కి హోస్ట్‌గా నాగార్జున ఎప్పుడో ఫిక్స‌య్యారు. తాజాగా స‌మంత పేరు చూసి అవాక్క‌య్యారు సినీ జ‌నాలు. స‌మంత గ‌నుక చేస్తే… ఈ షోకి కొత్త గ్లామ‌ర్ వ‌స్తుంద‌ని ఆశించారు.

అయితే.. బిగ్ బాస్ లో స‌మంత క‌నిపించ‌డం `బిగ్‌` జోక్ అంటూ… `బిగ్ బాస్` నిర్వాహ‌కులు తేల్చేశారు. అస‌లు ఆ ప్ర‌తిపాద‌నేదీ రాలేద‌ని టాక్‌. స‌మంత చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది. కొత్త సినిమాల్ని ఒప్పుకోవ‌డానికి స‌మంత ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. అలాంట‌ప్పుడు బిగ్ బాస్‌కి హోస్ట్ గా ఎందుకు క‌నిపించాల‌నుకుంటుంది? స‌మంత తెలుగు అంతంత మాత్ర‌మే. ధారాళంగా మాట్లాడ‌డం ఇంకా నేర్చుకోలేదు. బిగ్ బాస్ హోస్ట్ గా మెప్పించాలంటే… స్థానిక భాష‌లో ప‌ట్టు అవ‌స‌రం. నాని, ఎన్టీఆర్‌, నాగార్జున‌.. ఈ ముగ్గురూ తెలుగులో ప్రావీణ్యం ఉన్న‌వాళ్లే. అందుకే హోస్టులుగా రాణించారు. ఈ విష‌యంలో స‌మంత వెనుక‌బ‌డే ఉంటుంది. కాబ‌ట్టి.. స‌మంత‌ని బిగ్ బాస్ హోస్ట్‌గా తీసుకునే ఛాన్సే లేదు. స‌మంత కూడా ఈ న్యూస్‌ని చాలా లైట్ తీసుకుంద‌ని, అందుకే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇంకా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close