ఎవరితోనైనా పెట్టుకోండి… నాతోకాదు: చంద్రబాబు వార్నింగ్!

హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధినంతా కోస్తాలోనే చేస్తోందని, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందని ఇటీవల వినబడుతున్న వాదనలపై, విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనలో పాల్గొన్న చంద్రబాబు, రాయలసీమ అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా మాట్లాడారు. కర్నూలుజిల్లా ఓర్వకల్లులో నిర్మించబోయే ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన బాబు, అక్కడ జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. తన కంఠంలో ప్రాణముండగా సీమకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. కొంతమంది సీమకు అన్యాయం జరిగిందని అంటున్నారని, అన్యాయం ఎక్కడ జరిగిందో చెప్పాలని సవాల్ విసిరారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై చర్చకు రావాలని అన్నారు. కొందరు పెత్తందారులు పెట్టుబడులు రాకుండా అడ్డుకోటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక నేతలవల్లే సీమ వెనకబాటుతనం ఏర్పడిందని చెప్పారు. తానూ రాయలసీమ వాడినేనని, తాను ఇక్కడే పుట్టి పెరిగానని అన్నారు. చివరి రక్తపుబొట్టువరకు రాయలసీమను అభివృద్ధి చేస్తానని, రాయలసీమను సస్యశ్యామలం చేసేవరకు విశ్రమించనని అన్నారు. కర్నూలు జిల్లాను అభివృద్ధి చేసేవరకు నిద్రపోనని చెప్పారు. అభివృద్ధికి ఎవరైనా అడ్డు వస్తే బుల్లెట్‌లా దూసుకెళ్తానని అన్నారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చుగానీ, తనతో పెట్టుకోవద్దని, తన జోలికి వస్తే సహించనని హెచ్చరించారు. సీమకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. తప్పులుంటే సరిచేసుకోవటానికి సిద్ధం అన్నారు. సీమ అభివృద్ధిని అడ్డుకుంటే ఇక్కడే మకాం వేస్తానని, అవసరమైతే బస్సులో పడుకుని ఇక్కడే తిష్ఠ వేస్తానన్నారు.

చంద్రబాబు సీమకు పలు వరాలు గుప్పించారు. కర్నూలు నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడ 900 ఎకరాలలో విద్యాధామం ఏర్పాటు కానుందని చెప్పారు. కడపలో హజ్ హౌస్ ఏర్పాటు చేస్తున్నామని, ఉర్దూకోసం ప్రత్యేకంగా డీఎస్‌సీ నిర్వహిస్తామని అన్నారు. ఉర్దూ యూనివర్సిటీకి 125 ఎకరాలను కేటాయిస్తామని ప్రకటించారు. ముస్లిమ్‌లు అధికంగా ఉన్నచోట షాదీఖానా, ఈద్‌గా లాంటివాటిని ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కర్నూలులో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం ఆయన గోరుకల్లు చేరుకుని రిజర్వాయర్ పనులను పరిశీలించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close