తుపాను బాధితులకు జగన్ ఊహించనంత సాయం..!?

నివర్ తుపాన్ కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో సర్వం కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం తుపాను నివర్ ప్రభావం కనిపించింది. చెన్నైలా గాలులు చుట్టుముట్టకపోయినా .. ఎంత వర్షం పడితే.. నష్టం జరుగుతుందో.. అంత వర్షం పడింది. ముందస్తుగా చర్యలు కూడా లేకపోవడంతో.. ఎటూ తప్పించుకోవడానికిలేకుండా పోయింది. అదే సమయంలో కడప లాంటి నగరం నాలుగు అడుగుల నీరు లోతులో మునిగిపోయిది. అక్కడా కొన్ని వేల మంది నష్టపోయారు. వీరందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసి.. తిరుపతిలో సమీక్ష చేస్తారు.ఈ సందర్భంగా ఎవరూ ఊహించనంత పరిహారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎవరికైనా నష్టపరిహారం ప్రకటనలో జగన్మోహన్ రెడ్డిస్టైల్ వేరే ఉంటుంది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు.. మృతులకు యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తే.. ఆయన వెళ్లి ఏకంగా కోటి రూపాయలు ప్రకటించారు. దటీజ్ జగన్ అనిపించారు. ఇప్పుడు రైతులకు కూడా అదే తరహాసాయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎకరానికి కనీసం ఇరవై వేలు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వారిని కూడా షాక్ కు గురి చేసేలా సాయం ప్రకటించనున్నారని అంటున్నారు.

అలాగే కడప నగర వాసులకు జగన్ ప్రత్యేక సాయం ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ ఇంటికి రూ. పదివేలు చొప్పున ప్రకటించారు. అప్పటికప్పుడు పంపిణీ కూడా చేశారు. ఇంకా చాలా మందికి పెండింగ్ ఉంది. ఈలోపు ఎన్నికలొచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కడపలో ఎన్నికల మూడ్ కూడా ఉంది కాబట్టి.. ఇంటికి పదివేలు పంచినా రాజకీయ ప్రయోజనం కూడా ఉంటుందన్న చర్చ వైసీపీలో ఉంది. ఎంత ఇస్తారు.. అనేదానిపై క్లారిటీ లేకపోయినా.. సాయం విషయంలో మాత్రం ప్రతిపక్షాల డిమాండ్లకు విలువ లేకుండా చేస్తారన్న చర్చ మాత్రం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close