కేసీఆర్‌ని వద్దన్నారా..? కేసీఆరే వెళ్లడం లేదా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ప్రధాని హోదాలో వస్తున్నారు…వస్తోంది కూడా రాజకీయ పర్యటనకు కాదు. కాబట్టి.. ఓ ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం.. ముఖ్యమంత్రి ఎదురెళ్లి స్వాగతం చెప్పాలి. మామూలుగా అయితే.. ఇది పెద్ద వివాదం కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్లి స్వాగతం పలుకుతారు. అధికారిక కార్యక్రమాలకు వచ్చారని..మోడీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ లాంటి నేతలు కూడా వెళ్లి స్వాగతం పలికి సందర్భాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ మాత్రం వెళ్లడం లేదు. మోడీ పర్యటన ఖరారయినప్పటి నుండి అదే పనిగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మోడీకి స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్తారా లేదా అన్నదానిపైనే చర్చ.

శుక్రవారం సాయంత్రం వరకూ అదే తరహా చర్చ జరిగింది. వెళ్తారా.. లేదా అన్నదానిపై… సీఎంవో కూడా స్పష్టత ఇవ్వలేదు. చివరికి పొద్దు పోయిన తర్వాత ప్రధానమంత్రి మోదీనే స్వాగతానికి వద్దన్నారనే సమాచారాన్ని మీడియాకు అందించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యదర్శి స్వయంగా సీఎస్‌కు ఫోన్ చేశారని.. ఎలా స్వాగతం చెప్పాలో.. ఎవరెవరికి అనుమతి ఉందో చెప్పారని అంటున్నారు. మొత్తంగా ఐదుగురు అధికారులకు మాత్రమే మోడీకి స్వాగతం చెప్పడానికి పర్మిషన్ లభించింది. గవర్నర్ కూడా వెళ్లడం లేదు. పీఎంవో చెప్పిన ఈ ఫార్మాలా బాగుండటంతో.. కాగల కార్యం పీఎంవోనే తీర్చిందని.. టీఆర్ఎస్ వర్గాలు సంతోషపడ్డాయి.

అయితే.. తెలంగాణ పర్యటనకు వచ్చినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆహ్వానికి రాకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న ఉద్దేశంతోనే పీఎంవో… ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. గతంలో కేసీఆర్‌తో మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మారిపోయిన రాజకీయం కారణంగా కేసీఆర్ .. కేంద్రంపై యుద్ధం చేస్తానని చెబుతున్నారు. బీజేపీని బద్మాష్ బీజేపీ అంటున్నారు. ఈ కారణంగా గ్యాప్ పెరిగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిపై చెప్పులదాడి కేసులో కళావెంకట్రావు అరెస్ట్..!

రామతీర్థం ఘటనలో తనపై దాడి జరిగిందని దానికి కారణం చంద్రబాబు, అచ్చెన్న, కళా వెంకట్రావు అంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు శరవేగంగా స్పందించారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా...

కేటీఆర్‌ని కాదు దళితుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలట..!

టీఆర్ఎస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతూండటంతో ఆ పార్టీతో మైండ్ గేమ్ ప్రారంభించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్‌పై ఇతర నేతల్లో అసంతృప్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సీనియర్...

వాల్తేర్ క్లబ్‌ స్వాధీనానికి హైకోర్టు బ్రేక్..!

విశాఖ వాల్తేరు క్లబ్ భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా క్లబ్‌ను స్వాధీనం చేసుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో కీలక భాగాన్ని అందులో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ప్రయత్నాలుక హైకోర్టు...

పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే తిట్లు వినిపించలేదా ? : జేసీ

ఎస్పీని తిట్టినా.. హెచ్చరించినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై చిన్న కేసు పెట్టకపోవడం... చివరికి చిన్న చిన్న విషయపై పెద్ద పెద్ద లేఖలు రాసే పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించకపోవడంతో......

HOT NEWS

[X] Close
[X] Close