సీఎం రమేష్ వర్సెస్ జీవీఎల్..! టాపిక్ ..అచ్చోసిన ఆంబోతులు.!!

టీడీపీ ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మధ్య కొత్త వివాదం తలెత్తింది. ఇద్దరూ చర్చకు సై అంటే.. సై అని సవాళ్లు చేసుకుంటున్నారు. ఇద్దరి మాటల్లోనూ కామన్ గా వచ్చిన పదం ” అచ్చోసిన ఆంబోతులు”. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణదీక్ష చేసి… వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. సీఎం రమేష్.. తో పాటు.. ఎంపీలందరూ.. ఈ రోజు ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్ ను కలిశారు. వీరు కలవడానికి వెళ్లే ముందే.. ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. టీడీపీ ఎంపీపై.. ట్విట్టర్ లో విమర్శలు చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం.. ఏపీ ప్రభుత్వమే సమాచారం ఇవ్వలేదన్నారు. జీఎస్ఐ ద్వారా సబ్మిట్‌ చేయాల్సిన .. నివేదిక ఎందుకు ఆలస్యమైందో టీడీపీ ఎంపీలు తెలుసుకోవాలని ట్వీట్ చేశారు.

దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు కౌంటర్ ఇచ్చారు. జీఎస్ఐ నివేదికపై మాట్లాడాల్సింది కేంద్రమంత్రి అని … బీరేంద్రసింగ్ దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా… జీవీఎల్ ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నారు. జీవీఎల్‌ను ఒక అచ్చోసిన ఆంబోతులా రాష్ట్రంపైకి బీజేపీ పెద్దలు వదిలేశారని మండిపడ్డారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం. దొంగ దీక్షలు చేశామంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని.. జీవీఎల్‌ పచ్చి అబద్దాలకోరని ఎంపీ సీఎం రమేష్‌ మండిపడ్డారు. దీనిపైనే… జీవీఎల్ మళ్లీ ట్వీట్ చేశారు. అచ్చోసిన అంబోతులు ఎవరో అందరికీ తెలుసన్నారు. చర్చకు రావాలని సవాల్ చేశారు. గతంలో సుజనా చౌదరి ఇలాగే చర్చకు సవాల్ చేసి వెనుకడుగు వేశారని.. సీఎం రమేష్ … అలా కాకుండా చర్చకు రావాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ, పెర్మార్మెన్స్ తక్కువ అంటూ విమర్శలు గుప్పించారు.

ఉక్కు మంత్రిని కలిసిన టీడీపీ నేతలు… ఏపీ ప్రభుత్వం తరపున ఓ లేఖను అందించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలని లేఖలో కోరారు. కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఏపీకి అవకాశం కల్పించాలన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. లేకపోతే.. కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అంగీకారమా అంటూ లేఖ ఇచ్చారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం..ప్రైవేట్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అని లేఖలో టీడీపీ ఎంపీలు ప్రశ్నించారు. మొత్తానికి స్టీల్ ఫ్యాక్టరీ అంశంతో… జీవీఎల్ వర్సెస్ సీఎం రమేష్ అన్నట్లుగా రాజకీయం మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close