కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి పులివెందుల.. రెండు ఒంటిమిట్ట. ఈ రెండు స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.టీడీపీ తరపున పులివెందుల నుంచి జడ్పీటీసీగా బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో నిలిచారు. వైసీపీ తరపున చనిపోయిన అభ్యర్థి భార్యకు అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో గెలిపించేందుకు సీఎం రమేష్ రంగంలోకి దిగారు. పులివెందుల నియోజకవర్గంలో జరిగే జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి గెలుస్తుందని సీఎం రమేష్ ధీమాగా ఉన్నారు. కూటమి తరుపున బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతా రెడ్డి గెలుపు కోసం అందరం కలిసి కట్టుగా పని చేస్తామని ప్రకటించారు.
చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం జమ్మలమడుగు వెళ్లారు. అక్కడ వైఎస్ కుటుంబానికి చెందిన కొంత మంది నేతలు టీడీపీలో చేరారు. రెండు జడ్పీటీసీల్లో గెలుపు కోసం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. వైఎస్ కుటుంబీకులు ఇప్పుడు ఏకతాటి మీద లేరు. కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ష్రమిల అనుచరుడు ఒకరు పోటీకి దిగారు. ఒంటి మిట్ట మీద రాజకీయ పార్టీల దృష్టి తక్కువగా ఉన్నప్పటికీ.. స్థానిక నేతలు మాత్రం హోరాహోరీ పోరాడుతున్నారు.
పులివెందులలో .. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నాహవా మాత్రం వైఎస్ కుటుంబానిదే ఉంటుంది. కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి.జగన్ రెడ్డిని నమ్ముకుంటే బాగుపడేది లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆయనకు గుడ్ బై చెప్పి వేరే దారి చూసుకుంటున్నారు.దుష్యంత్ రెడ్డి అనే నేత ఇప్పటికే టీడీపీకి పని చేస్తున్నారు. అధికారికంగా ఇంకా పార్టీలో చేరలేదు. వైఎస్ కుటుంబం పని చేసే పరిస్థితుల్లో లేదు. అవినాష్ రెడ్డి ఈ ఎన్నికను సవాల్ తీసుకుని పని చేసుకుంటున్నారు. తేడా వస్తే జగన్ పరిస్థితి ఊహించనంతగా దిగజారిపోతుంది.