వైసీపీ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదన్న జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్.. స్కామ్ జరిగినట్లు నిరూపిస్తా.. రాజకీయాల నుంచి జగన్ తప్పుకుంటారా? అని సవాల్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసు అని చెప్పారు.
మద్యం విషయంలో చాలా విషయాలను సిట్ వదిలేసిందన్న సీఎం రమేశ్.. తాను సిట్ కు కీలక విషయాలను వెల్లడించేందుకు సిద్దంగా ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు. వైసీపీ హయాంలో మద్యం షాపులో పని చేసే వారికి ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు చెప్పి, అందులో సగం జగన్ అనుచరులు కాజేశారని ఆరోపించారు.
లిక్కర్ స్కామ్ కు సంబంధించి తన వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని, నిందితులు ఎవరూ తప్పించుకోలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది డిస్టలరీలను భయపెట్టి జగన్ సొంతం చేసుకున్నారని, ఆయన బెదిరింపులతో నాసిరకం మద్యం విక్రయించారని ఆరోపించారు. ఈ స్కామ్ పై ప్రస్తుతం విచారణ నడుస్తోందని, విచారణ ఎదుర్కొనేందుకు జగన్ రెడ్డి కూడా సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.