పోలీస్ బాస్ ల‌ను మార్చే ప‌నిలో సీఎం రేవంత్

తెలంగాణ‌లో మ‌రోసారి సీనియ‌ర్ ఐపీఎస్ ల బ‌దిలీ జ‌ర‌గ‌బోతుంది. ఒక‌ట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతుంది. ప్ర‌స్తుతం ఉన్న డీజీపీ ర‌విగుప్తా స్థానంలో పూర్తిస్థాయి డీజీపీ రాబోతున్నారు.

ఎన్నిక‌ల సంఘం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా అప్పుడున్న డీజీపీ అంజ‌నీకుమార్ ను బ‌దిలీ చేసి ర‌విగుప్తాను నియ‌మించింది. ఆనాటి నుండి ఆయ‌నే కొన‌సాగుతుండ‌గా… ఇప్పుడు డీజీపీ జితేంద‌ర్ ను అపాయింట్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న హోంశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా ఉన్నారు.

ఇక ఎన్నిక‌ల సమ‌యంలో బ‌దిలీ అయిన సీనియ‌ర్ ఐపీఎస్ సుధీర్ బాబును మ‌ళ్లీ రాచ‌కొండ క‌మిష‌న‌ర్ గా తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. ఇప్పుడున్న క‌మిష‌న‌ర్ ను మ‌ల్టీజోన్ ఐజీగా ట్రాన్స్ఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

వీరితో పాటు గ్రేట‌ర్ ప‌రిధిలోని మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారుల‌కు బ‌దిలీ ఉంటుంద‌ని… సీఎం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గానే జీవోలు విడుద‌ల కాబోతున్నాయ‌ని పోలీస్ శాఖ‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

సీఐడీ మాజీ డీజీపై క్రమశిక్షణా చర్యలు ?

విధి నిర్వహణలో తప్పుడు పనులు చేయడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రఘురామ చేసిన...

జనసైనికుడు అవ్వాలనుకుంటున్నారా ?

జనసేన పార్టీ ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. పార్టీ పెట్టిన తర్వాత తొలి సారి ఘన విజయాల్ని సాధించింది. ఇప్పుడు సంస్థాగతంగా బలపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 18...

HOT NEWS

css.php
[X] Close
[X] Close