అక్రమ కట్టడాల పర్మిషన్ల ఇచ్చిన వారిపై కేసులు షురూ !

చెరువు శిఖం భూములు, ఫుల్ ట్యాంక్ లెవల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు సరే.. మరి వాటికి అనుమతి ఇచ్చిన అధికారుల సంగతేంటి అన్న ప్రశ్న ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు దానికి సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయింది. అక్రమ కట్టాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కేసులు పెట్టనున్నారు. ఈ మేరకు హైడ్రా ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా తప్పు చేసిన అధికారులను అలా వదిలేస్తే.. తమకేమీ సమస్య రాదుగా అని.. అనుమతులు ఇచ్చే అధికారులు ఇస్తూనే ఉంటారని.. వారిని కట్టడి చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది. ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు ఇవ్వబట్టే వారు కట్టుకున్నారని… నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అనుమతులు మంజూరు చేసిన వారిదే మొదటి తప్పని నిర్ణయానికి వచ్చారు. లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

హైడ్రా.. ఇప్పుడు లిస్ట్ మొత్తం రెడీ చేసింది. కూల్చి వేతలకు సిద్ధం అవుతోంది.. అయితే ఎక్కువగా కాలేజీలు, విద్యాసంస్థలు ఉండటంతో వాటి విషయలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముందుగా నోటీసులు ఇచ్చి వాటిని షిఫ్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఇచ్చిన గడువు తర్వాత నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని అంటున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీని సమావేశపర్చే విషయంపైనా సీఎం రేవంత్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌న‌సేన‌లోకా… కాంగ్రెస్ గూటికా… బాలినేని దారెటు?

అదిగో రాజీనామా... ఇదిగో రాజీనామా... వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పేస్తారు అంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. వైసీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, జ‌గ‌న్ పై అసంతృప్తి అన్నీ క‌లిసి......

వైసీపీకి బిగ్ షాక్… బాలినేని రాజీనామా!

ఎన్నో రోజులుగా ఉన్న అసంతృప్తి... జ‌గ‌న్ ఎన్ని రాయ‌బారాలు పంపినా బాలినేని ఆగ‌లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతార‌న్న పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నిక‌లకు ముందు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయండి… హైకోర్టు కీల‌క ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ అనుమ‌తి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ...

కొడాలి నాని.. వల్లభనేని వంశీ సైలెన్స్ వెనక కారణం ఇదేనా ?

కొడాలి నాని.. వల్లభనేని వంశీ...ఫైర్ బ్రాండ్ నేతలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ ప్రత్యర్ధి పార్టీల నేతలపై చెలరేగిపోయిన వీరిద్దరూ .. కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close