వైఎస్ తప్పు చేశారని జగన్ సర్టిఫికెట్ “మండలి రద్దు” ..!

శాసనమండలిని రద్దు చేయాలని.. దాని వల్ల ప్రజలకు ఉపయోగం లేదని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీలో ఈ ప్రకటన చేసిన వెంటనే.. చాలా మందికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  గుర్తుకు వచ్చారు. స్వయంగా.. వైసీపీ సభ్యులే గుర్తుకు వచ్చేలా చేశారు. శాసనమండలిని ఉనికిలోకి తెచ్చింది.. వైఎస్సేనని కొడాలి నాని వంటి వాళ్లు గొప్పగా చెప్పారు కూడా. మరి రాజన్న రాజ్యం తెస్తానని… మేనిఫెస్టోలో చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఆ రాజన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శాసనమండలిని రద్దు చేస్తానని ఆవేశపడటం దేనికి సంకేతం..?

ఎన్టీఆర్ రద్దు చేశారు.. రాజన్న ఏర్పాటు చేశారు..!

శాసనమండలి ఉండాలా లేదా..అన్నది రాష్ట్రాల ఆసక్తి మీద ఉంటుంది. అది ఖచ్చితం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు మొదటి నుంచి శాసనమండలి ఉంది. కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నంత కాలం మండలికి ఎదురు లేదు. కానీ.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కానీ మండలిలో మాత్రం.. కాంగ్రెస్ ప్రాధాన్యం అలాగే ఉండిపోయింది. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉంది. శాసన మండలిలో మాత్రం కాంగ్రెస్ కు మెజార్టీ ఉంది. ఓ పత్రికాధిపతికి పిలిపించి శిక్షించాలనే నిర్ణయాన్ని మండలి తీసుకోవడం.. ఎన్టీఆర్ ఆగ్రహించి.. రద్దు చేసేశారు. అప్పట్లోనూ.. రాజ్యాంగం ప్రకారం.. ప్రాసెస్ నడిచింది. మండలి రద్దు కావడానికి దాదాపుగా ఏడాది సమయం పట్టింది.

రాజన్న రాజ్యంలో రాజన్న ముద్రలు చెరిపేస్తున్నారా..?

ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినా.. మండలిని మళ్లీ ప్రారంభించాలనే ఆలోచన చేయలేదు. ఒకసారి చెన్నారెడ్డి హయాంలో మండలి ఏర్పాటుకు ప్రయత్నం జరిగినా లోక్ సభ రద్దవడంతో మండలి ఏర్పాటు బిల్లు కూడా మురిగిపోయింది. ఆ తర్వతా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 9 ఏళ్లకుపైగా.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ..  శాసనమండలి మళ్లీ ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా తీసుకురాలేదు. అయితే.. 2004లో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత … తన పాలనలో మేధావులు కూడా శాసన వ్యవస్థలో భాగం కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసి శాసనమండలిని ఏర్పాటు చేశారు. నిజానికి వైఎస్ ఉద్దేశం మాత్రం పార్టీలోని ఆశావహులకు పదవులు కల్పించడమే. అప్పట్లో అసమ్మతిని ఎదుర్కొనేందుకు ఆయన పదవుల పందేరంపై దృష్టి పెట్టారు. శాసనమండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2005లో నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో… ఉభయసభల్లో ఆమోదం పొందడం.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం.. సులువుగా జరిగింది. కానీ.. రెండేళ్లకుపైగా సమయం పట్టింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ శాసనమండలి ఏర్పాటయింది.

జగన్ రద్దు చేసి..  వైఎస్ చేసిన తప్పును కరెక్ట్ చేస్తారా..?  

అప్పట్లోనే మండలిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ వైఎస్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజాధనం దుర్వినియోగాన్నే.. కారణంగా చెబుతూ… మండలి రద్దు చేయాల్సి ఉందన్నట్లుగా మాట్లాడారు. అంటే..నాడు వైఎస్ చేసింది తప్పేనని..నేడు జగన్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లుగానే భావించాల్సిన పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close