కో లివింగ్ .. ఈ మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కొంత మంది బుర్ర తక్కువ వాళ్లు కో లివింగ్ అంటే అమ్మాయిలు, అబ్బాయిలు సహజీవనం చేసేందుకు హాస్టల్స్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ మారుతున్న యువత ఆలోచనలకు ఓ రూపం. ఇక్క డ సహజీవనం అన్న ప్రశ్న రాదు. రియల్ ఎస్టేట్ రూపంలో రాబోయే రోజుల్లో ఈ రంగంలో మంచి గ్రోత్ ఉంటుందని అనుకోవచ్చు
నగరాల్లో ఒంటరి జీవితం నుంచి కమ్యూనిటీ లైఫ్‌కు మారుతున్న యువతరం కోసం ‘కో-లివింగ్’ ఒక రెవల్యూషనరీ హౌసింగ్ మోడల్‌గా ఎదిగింది. ఒకే భవనంలో ప్రైవేట్ బెడ్రూమ్లతో పాటు షేర్డ్ కిచెన్, లివింగ్ రూమ్, జిమ్, వర్క్‌స్పేస్‌లు ఉండటమే కో లివింగ్. ట్రెడిషనల్ రెంటల్ ఫ్లాట్స్‌కు ఆకర్షణీయమైన ఆల్టర్నేటివ్గా మారింది. 2025లో భారత్‌లో, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ఐటీ హబ్‌లలో ఈ ట్రెండ్ బూమ్ అవుతోంది.
భారత్‌లో అర్బనైజేషన్ వేగంగా పెరుగుతుండటమే ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం. హైదరాబాద్‌లో జాబ్ మైగ్రేషన్ భారీగా ఉండటంతో, యంగ్ ప్రొఫెషనల్స్ , స్టూడెంట్స్ అఫర్డబుల్ హౌసింగ్ కోసం కో-లివింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఒక 1బీహెచ్‌కే ఫ్లాట్ రెంట్ హైదరాబాద్‌లో రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటే, కో-లివింగ్‌లో రూ.10 వేల నుంచి రూ.18 వేలకే అన్ని సౌకర్యాలు వై-ఫై, హౌస్‌కీపింగ్, యుటిలిటీస్ ఇన్క్లూసివ్గా లభిస్తాయి.
మిలేనియల్స్ , జెన్-జీ తరం ప్రాధాన్యతలు ఈ మోడల్‌ను మరింత బలపరుస్తున్నాయి. కోలియర్స్ 2025 రిపోర్ట్ ప్రకారం, 78 శాతం యంగ్ ప్రొఫెషనల్స్ ‘కమ్యూనిటీ’ని ముఖ్యమైన అంశంగా చూస్తున్నారు. వర్క్-ఫ్రమ్-హోమ్ కల్చర్, నెట్వర్కింగ్ అవసరాలు కో-లివింగ్‌ను ఎంచుకునేలా చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. గచ్చిబౌలి, మడ్హాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి వంటి ఏరియాలు హాట్ జోన్స్‌గా మారాయి.
