కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ముందుగా 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్న కాగ్నిజెంట్ ఇప్పుడు మరింతగా విస్తరించాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు సమక్షంలో ఉద్యోగాలు 25 వేలు కల్పిస్తామని సీఈఓ రవికుమార్ ప్రకటించారు. విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ క్యాంపస్ లో పని చేయడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి ఇటీవల కాగ్నిజెంట్ ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. నాలుగున్నర వేల మంది ఉద్యోగులు తాము వెంటనే విశాఖకు షిఫ్ట్ అవుతామని చెప్పారు.
ప్రస్తుతం శంకుస్థాపన చేసిన క్యాంపస్ 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో పూర్తి కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అప్పటి అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగిస్తుంది. విశాఖ క్యాంపస్లో ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి పెడుతుంది.
ఒక్క పిలుపుతో 4500 మంది కాగ్నిజెంట్ విశాఖ నుంచి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం సంతోషమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వచ్చే ఆగస్ట్ కి భోగాపురం ఎయిర్ పోర్ట్ సిద్ధం అవుతోంది. 15బిలియన్లుతో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. టీసీఎస్ కూడా వస్తోందన్నారు. విశాఖ లో మిగతా నగరాలు కంటే 20 శాతం నివాస ఖర్చు తక్కువ. నెట్ జీరో కాలుష్య రహిత నగరం గా విశాఖ తీర్చి దిద్దుతామని భరోసా ఇచ్చారు. గూగుల్, కాగ్నిజెంట్ , మైక్రోసాఫ్ట్ లను నడిపించే సీఈఓ లు మన భారతీయులు తెలుగు వారు ఉన్నారన్నారు. కాగ్నిజెంట్ లక్ష ఉద్యోగాలు కల్పన చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
