‘రామబాణం’ మాస్ మిక్సర్

గోపీచంద్, శ్రీవాస్ ల హిట్ కాంబినేషన్. లక్ష్యం, లౌక్యం సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు వీరి కలయికలో మూడో చిత్రంగా వస్తోంది రామబాణం. ఈ రోజు ట్రైలర్ బయటికి వచ్చింది. శ్రీవాస్ సినిమాల్లో ఫన్, రోమాన్స్, సెంటిమెంట్, మాస్ యాక్షన్ మిక్సర్ గా వుంటాయి. ‘రామబాణం’లో కూడా అదే ఫార్ములా కనిపించింది. ట్రైలర్ బిగినింగ్ లో ఫన్ చూపించి తర్వాత రోమాన్స్ యాడ్ చేసి.. సెంటిమెంట్ దిశగా యాక్షన్ వైపు మళ్ళింది ట్రైలర్.

ట్రైలర్ లో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా వున్నాయి. ‘ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్’ అని జగపతి బాబు చెప్పిన డైలాగ్ రామబాణం కథని సూచిస్తోంది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు ఫుడ్ మాఫియా పాయింట్ ని కూడా రామబాణంలో టచ్ చేశారు. గోపీచంద్ లుక్, యాక్షన్ బావుంది. తెరపై జగపతి బాబు, ఖుష్బు, తరుణ్ అరోరా… ఇలా భారీ తారాగణం కనిపించింది.

”ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద. ఇప్పుడు చెయ్యి ఎత్తినోడికే మర్యాద”

”నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డ్ లాంటోడిని. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపొతే.. చావు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది” ఇలాంటి మాస్ డైలాగులు కూడా వినిపించాయి.
మొత్తానికి మాస్ ఎలిమెంట్స్ తో రామబాణం తయారైయిందని ట్రైలర్ చెబుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close