విశాఖలో టీసీఎస్ క్యాంపస్ పెట్టబోతున్నామని గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించింది. ఓ రోజు నారా లోకేష్ హఠాత్తుగా ముంబైకి వెళ్లి టీసీఎస్ చైర్మన్ తో సమావేశం అయ్యారు. కానీ టీసీఎస్ పెట్టుబడుల ప్రకటన ఆయన చేయలేదు. కంపెనీ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుందని అనుకున్నారు. అనుకున్నట్లుగా టీసీఎస్ పది వేల మంది ఉద్యోగులు పని చేసేలా విశాఖలో క్యాంపస్ పెడతామని ప్రకటించింది. చాలా మంది ఇలాంటి ప్రకటనలు చాలా వచ్చాయి..క్యాంపస్ రావాలి కదా అనుకున్నారు. పది అంటే పది నెలల్లోనే విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాశ్వత భవనాలు నిర్మించేదాకా ఎదురు చూడకుండా.. టీసీఎస్ వచ్చేసింది.
ఎంవోయూల తర్వాత వేగంగా పెట్టుబడుల రాక
ఆరు నెలల కిందట గూగుల్ ప్రతినిధులు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. విశాఖలో గూగుల్ క్యాంపస్ పెడతామని ప్రతిపాదించారు. చంద్రబాబు అంగీకరించకుండా ఉంటారా ?. ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. మూడు నెలల్లోనే అధికారిక ప్రకటన వచ్చింది. కేంద్రం కూడా అన్ని క్లియరెన్స్‌లు ఇచ్చింది. ఇక గూగుల్ నిర్మాణాలు ప్రారంభించబోతోంది. అమెరికా బయట అతి పెద్ద డేటా సెంటర్ ను నిర్మించబోతోంది. గూగుల్ రాకపోతే.. వచ్చే కంపెనీలు చాలా ఉంటాయి. ఓ రకంగా విశాఖ డేటా సెంటర్ హబ్ గా మారుతుంది.
దావోస్ సమావేశాలు – ఫాలో అప్ తో వేగంగా పెట్టుబడులు
అలాగే దావోస్‌లో ఓ పది నిమిషాలు కాగ్నిజెంట్ సీఈవోతో చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత అది కూడా ఫలప్రదం అయింది. కంపెనీ అధికారికంగా తమ క్యాంపస్ ఏర్పాటును ప్రకటించింది. ఈ ఏడాదిలోనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అలాగే…మెర్సెస్ పేరుతో అంతర్జాతీయంగా కార్గో నిర్వహించి సంస్థ కూడా బిలియన్ డాలర్ల పెట్టుబడిని గ్రౌండ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. వారికి కావాల్సిన అనుమతులు, ఇతర సహకారాన్ని ప్రభుత్వం వేగంగా అందిస్తోంది.
పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచడమే కీలకం
ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలనుకున్న వారినే కాదు.. తమ రాష్ట్రంలో ఉన్న మంచి పాలసీలను అడాప్ట్ చేసుకుని మెరుగైన ఉత్పత్తులు, తక్కువ ధరతో ఉత్పత్తి చేసుకవచ్చని సంప్రదిస్తున్నారు. వారికి నమ్మకం కలిగిస్తున్నారు. పెట్టుబడులకు భరోసా ఇస్తున్నారు. ఈ కారాణంగా ప్రపంచ పెట్టుబడిదారులు ఏపీ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. గత ప్రభుత్వం కారణంగా వేధింపులకు గురయినా వారు ఇప్పటికీ సంశయిస్తున్నారు. వారికి ఇంకా నమ్మకం రావాల్సింది. అది రావాలంటే.. భూతం మళ్లీ రాదన్న నమ్మకం కలిగించాల్సి ఉంటుంది.