ఇక మొద‌లైన‌ట్లే…స‌జ్జ‌ల‌పై సీఐడీకి ఫిర్యాదు

జ‌గ‌న్ స‌ర్కారులో స‌క‌ల శాఖా మంత్రిగా వ్య‌వ‌హ‌రించి… అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను త‌న క‌నుస‌న్న‌ల్లో మేనేజ్ చేసిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిన‌ట్లేనా అంటే అవున‌నే క‌న‌ప‌డుతోంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల అండ‌దండ‌ల‌తో త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేశారంటూ స‌జ్జ‌ల బాధితులు ఒక్కొక్క‌రుగా ఫిర్యాదు చేస్తున్నారు.

గ‌నుల శాఖ‌ల స‌జ్జ‌ల అండ చూసుకొని శ్రీ‌కాంత్ రెడ్డి, ధనుంజ‌య్ రెడ్డిలు దౌర్జ‌న్యాలు చేశార‌ని… శ్రీ‌చ‌ర్, కృష్ణ‌య్య‌ల‌ను అడ్డంపెట్టుకొని అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని సీఐడీకి ఫిర్యాదు అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన బ‌ద్రీనాథ్ అనే గ‌నుల య‌జ‌మాని ఈ ఫిర్యాదు చేశారు.

సైదాపురం మండ‌లం జోగుప‌ల్లిలో మాకు 240ఎక‌రాల స్థ‌లం ఉండ‌గా 8 గ‌నులున్నాయి. రెండు సంవ‌త్స‌రాలుగా వీరు అక్ర‌మంగా మా గ‌నుల‌ను దోచేశారు. 800కోట్ల ట‌న్నుల వ‌ర‌కు త‌వ్వి వేల కోట్లు సంపాదించారు. దీనిపై ప్ర‌శ్నిస్తే బెదిరించార‌ని, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను కూడా ఉల్లంఘించి గ‌నుల‌ను త‌వ్విన‌ట్లు బ‌ద్రీనాథ్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైసీపీ పాల‌న‌లో త‌మ ప్ర‌త్య‌ర్ధుల‌ను సీఐడీ కేసుల‌తో వేధించిన జ‌గ‌న్ స‌ర్కార్ కు… ఇప్పుడు ఆనాటి ప్ర‌భుత్వ బాధితుల నుండి వ‌స్తున్న ఫిర్యాదులు, కేసుల‌తో బ్యాడ్ టైం స్టార్ట్ అయిన‌ట్లేన‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

సీఐడీ మాజీ డీజీపై క్రమశిక్షణా చర్యలు ?

విధి నిర్వహణలో తప్పుడు పనులు చేయడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రఘురామ చేసిన...

జనసైనికుడు అవ్వాలనుకుంటున్నారా ?

జనసేన పార్టీ ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. పార్టీ పెట్టిన తర్వాత తొలి సారి ఘన విజయాల్ని సాధించింది. ఇప్పుడు సంస్థాగతంగా బలపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 18...

HOT NEWS

css.php
[X] Close
[X] Close