జగన్‌పై ఢిల్లీలో బీజేపీ వరుస ఫిర్యాదులు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్‌గా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో సీబీఐ కోర్టు పెట్టాలంటూ.. ఉదయం రవిశంకర్ ప్రసాద్‌కు.. వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నేతలు.. సాయంత్రం.. మరో బ్యాచ్‌గా అమిత్ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలపై… వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఫిర్యాదు చేశారు. అయితే… రవిశంకర్ ప్రసాద్ ను కలిసిన బృందానికి.. అమిత్ షా కలిసిన బృందానికి తేడా చూపించారు. రెండూ వేర్వేరు బృందాలు. రెండింటిలోనూ.. విష్ణువర్ధన్ రెడ్డి లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గంగా ప్రచారం పొందిన వారు.. జగన్ పై ఫిర్యాదులకు దూరంగా ఉంటున్నారు. కానీ నిఖార్సైన బీజేపీ వాదులు మాత్రం.. జగన్ రెడ్డి సర్కార్ పై ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు.

టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరుతుందే రక్షణ కోసం. బీజేపీ బలం పుంజుకుందని.. ఏపీలో దున్నేస్తుందని కాదు. ఆ రక్షణ కూడా.. బీజేపీలో చేరినా లేదన్న భావన.. ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ బీజేపీ నేతలనూ వదిలి పెట్టడం లేదు. బీజేపీలో చేరిన జమ్మలమడుగు నేత ఆదినారాయణరెడ్డికి… వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. అలాగే.., జిల్లాల్లోనూ… బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. దీన్ని బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. ఇలా బెదిరింపులకు దిగడమే కాదు.. బీజేపీ నేతల్ని.. వైసీపీలో చేర్చుకునేందుకు దూకుడుగా వెళ్తున్నారు కూడా..!

భారతీయ జనతా పార్టీని వైసీపీ టార్గెట్ చేసిందని.. ఆ పార్టీ నేతలకు.. క్లారిటీ వచ్చింది. ఇప్పటికైనా మేలుకోకపోతే.. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తిన్న దెబ్బల కన్నా.. ఎక్కువగా .. జగన్ చేతిలో చావుదెబ్బ తినాల్సి వస్తుందన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే.. ఢిల్లీ వ్యూహకర్తలు.. ఫిర్యాదుల వ్యూహానికి తెర తీసినట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో సీబీఐ కోర్టు పెట్టడం… అమిత్ షాకు.. బీజేపీ నేతల ఫిర్యాదులు.. తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా చెబుతున్నారు. అదే నిజమైతే.. కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు ఖాయం అని అనుకోవచ్చు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close