ఏపీ మార్క్ : ఆ గుంతల రోడ్లకే టోల్ ఫీజులు.. ఫైన్లు కూడా..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి నిర్వహణ లేకపోవడంతో… రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. సోషల్ మీడియాలో ఆ రోడ్ల సౌందర్యం హల్ చల్ చేస్తున్నాయి. అదే సమయంలో మంత్రులు కూడా కేబినెట్ భేటీలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే.. అప్పటికప్పుడు నియోజకవర్గానికి రెండుకోట్లు విడుదల చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ రూపాయి కూడా విడుదల కాలేదు. ఆ రెండు కోట్ల కోసం… పెట్రోల్, డీజిల్‌పై సెస్సు విధించారు. కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. తాజాగా… రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం పదిహేను మార్గాల వరకూ నిర్ణయించారు.

ఏడాదిలో రెండు వందల కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారులు అదీ కూడా… బడా కాంట్రాక్టర్లు… నిర్మించిన అతి పెద్ద రహదారులపైనే టోల్ టాక్స్ వసూలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. అంటే.. జాతీయ రహదారుల్లో కాకుండా… జిల్లాలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి కూడా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆదాయం కోసం.. త్వరలో మరిన్ని రోడ్లకు కావాలంటే… ఇంకా మొత్తం రోడ్లకు ఈ టోల్ ట్యాక్స్‌ను విస్తరించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ముందుగా కనీసం రోడ్లు బాగు చేయాలని.. ఆ తర్వాత ఆదాయం పిండుకునే ప్రయత్నం చేయాలన్న సూచనలు ..సలహాలు ప్రభుత్వానికి అందుతున్నాయి.

గుంతల మయంగా మారిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే.. ప్రజలు శాపనార్ధాలు పెడతారని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. ఆదాయానికి ఇదో మార్గంగాఎంచుకుంది. కొసమెరుపేమిటంటే… ఈ రోడ్లపై ప్రయాణించే వారికి.. ఫైన్లు అదనం. ఎక్కడ హారన్ కొట్టినా.. అక్కడ హారన్ కొట్టాల్సిన అవసరంలేదని… ఆఫీసర్‌కి అనిపిస్తే రూ. వెయ్యి చలాన్ ఇంటికి పంపిస్తారు. ఇలాంటి ఖర్చులు ఏపీ పరోడ్లపైకి వెళ్తే చాలా కనిపిస్తాయి. ఓ రకంగా ప్రభుత్వం పిండేస్తుందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేసీ ఫ్యామిలీకి రూ. వంద కోట్ల జరిమానా..!

అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. వంద కోట్ల జరిమానా విధించింది. గతంలో ప్రభుత్వం నుంచి మైనింగ్ కోసం లీజుకు భూముల్ని...

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

HOT NEWS

[X] Close
[X] Close