మహాకూటమిలో సీపీఐకి ఏమైనా మిగులుతుందా..?

కాంగ్రెస్ పార్టీ.. సీపీఐని.. చాలా తేలిగ్గా తీసుకుంటుంది. రెండు, మూడు సీట్లు అంటూ లీకులు ఇచ్చి చివరికి అవి కూడా.. ఏ మాత్రం బలం లేని స్థానాలు కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పోటీ చేయాలనుకోంటోన్న స్థానాలను సీపీఐ కూడా ఆశిస్తోంది. దీంతో ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై ఆ రెండు పార్టీల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చినా.. పోటీ చేసే స్థానా‌ల‌విషయంలో కూటమి పార్టీలో స్పష్టత రావటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ సీపీఐ లు కొన్ని స్థానాల విషయంలో పట్టు వీడటం లేదు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాలను రెండు పార్టీలు ఆశిస్తున్నాయి.

ఈ రెండు స్థానాలను 2014లో టీఆర్ఎస్ గెల్చుకుంది. కొత్తగూడెం సీటును కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆశిస్తున్నాడు. ఇదే స్థానాన్ని సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరుతున్నారు. హుస్నాబాద్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు.‌ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఉన్నాడు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకటనలతో కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై అయోమయం నెలకొంది. కాంగ్రెస్ గెలిచే స్థానాలను వదులుకోమని స్వయంగా ఆపార్టీ నేతలే ప్రకటిస్తున్నారు. దీంతో సీపీఐ అడుగుతోన్న స్థానాలను .. కాంగ్రెస్ ఇస్తామంటోన్న స్థానాలపై క్లారిటీ మిస్ అవుతోంది‌. దేవరకొండ, బెల్లంపల్లి, వైరా సీట్లు కూడా కావాలని సీపీఐ అడుగుతోంది. ఇదే విషయాన్ని చాడ వెంటరెడ్డి బుధవారం జరిగిన సమావేశంలో ఎల్.రమణ, కోదండరాం దగ్గర ప్రస్తావించారు.

మరో వైపు సీపీఐకు నాలుగు స్థానాలిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి లీకులివ్వడంపై కూడా చాడ వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే.. చివరికి సీపీఐకి… తను కోరుకున్న స్థానాలు కాకుండా.. అవకాశాల్లేని చోట్ల సీట్లను ఖరారు చేస్తారేమోనన్న టెన్షన్ పట్టుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close