ఈనెల 27న రవితేజ – మాస్ జాతర విడుదల కావాల్సివుంది. అయితే…. అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని వాయిదా వేశారు. సెప్టెంబరు 12న వస్తుందని టాలీవుడ్ లో ఓ టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు సెప్టెంబరు 12న కూడా ఈ సినిమా రావడం వీలు కాదని తెలుస్తోంది.
సినిమా అంతా చూసుకొన్న తరవాత కొన్ని రిపేర్లు అవసరం అని టీమ్ భావిస్తోందని టాక్. కొన్ని సీన్లు రీషూట్ చేయాల్సిన అవసరం ఉందని సమాచారం అందుతోంది. అందుకోసం రవితేజ, శ్రీలీలతో పాటు ఇంకొంతమంది కీలకమైన నటీనటుల డేట్స్ మళ్లీ అవసరమయ్యాయి. వాళ్లందరి డేట్లు చూసుకొని, రీషూట్లు చేసుకొంటే తప్ప.. కొత్త డేట్ ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు.
పైగా సితార ఎంటర్టైన్మెంట్స్ కాస్త కుదుపుల్లో పడింది. కింగ్ డమ్, వార్ 2 సినిమాలతో నష్టాల్ని చవి చూడాల్సివచ్చింది. ఇప్పుడు కమ్ బ్యాక్ గట్టిగా ఇవ్వాల్సిందే. అందుకే ‘మాస్ జాతర’పై నాగవంశీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. ‘వార్ 2’ హిట్టయితే.. ఆ ఉత్సాహంలో `మాస్ జాతర`ని వదిలేసేశారేమో. ఫలితం తేడా కొట్టడంతో తదుపరి సినిమాపై జాగ్రత్తలు పెరిగాయి. అదీ ఒకందుకు మంచిదే. రిలీజ్ ఆలస్యమైనా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక్కసారి సినిమాపై నెగిటీవ్ టాక్ వస్తే మాత్రం – ఆ ట్రోలింగ్ తట్టుకోవడం చాలా కష్టం. ఈ విషయం నాగవంశీకి బాగా తెలుసు. అందుకే జాగ్రత్త పడుతున్నారు.