ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డితో కలిసి జీవన్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు పని చేస్తున్న చోటకు వెళ్లి వారు కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. అంతలోనే జీవన్ రెడ్డి వద్దకి వచ్చిన ఓ ఉపాధి కూలీ మహిళా కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేశానని,అయినా తనకు మాత్రం ఫించన్ రావడం లేదని మోరపెట్టుకుంది. ఓటు ఎవరికీ వేశావని జీవన్ రెడ్డి ప్రశ్నించగా మీకే వేశానని సమాధానమివ్వగా ఆర్మూర్ లో వినయ్ రెడ్డి గెలవలేదని, అన్యాయం జరిగిందన్నారు జీవన్ రెడ్డి. శాంతించని మహిళా తనకు ఫించన్ రావడం లేదనడంతో ఆమె చెంప చెల్లుమనిపించారు జీవన్ రెడ్డి.

ఆ సంభాషణను అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీయడంతో క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి భయంతో ప్రశ్నించిన వారిపై చేయి చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే, మహిళను చెంపపై జీవన్ రెడ్డి సరదాగానే కొట్టినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close