కాంగ్రెస్ లో రాహుల్ సంక్షోభానికి ముగింపు ఎక్క‌డ‌..?

ఆయ‌నేమో నేను ఉండ‌ను అంటారు, పార్టీ నాయ‌కులేమో మీరే ఉండాలంటారు. న‌చ్చ‌జెప్తే విన‌నంటారు, ఆయ‌న పోతానంటున్నాడుగా పోనీ, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందామ‌ని పార్టీ నాయ‌కులూ అన‌డం లేదు. ఆయ‌న ఉండ‌నంటున్నా ఆయ‌నే ఉండాల‌న్న‌ది వీళ్ల ప‌ట్టుద‌ల‌! ఎవ‌రు ఉండ‌మంటున్నా నేను ఉండ‌లేను అంటున్న‌ది ఆయ‌న ప‌ట్టుద‌ల‌. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొన‌సాగుతారా లేదా అనే చ‌ర్చ ఇలానే కొనసా….గుతూ ఉంది. నిన్న‌టికి నిన్న మ‌రోసారి పార్టీలోని కీల‌క నేత‌ల‌కు యువ‌రాజును మెత్త‌బెట్టే ప్ర‌య‌త్నం చేశారు. షీలా దీక్షిత్, జేపీ అగ‌ర్వాల్, అజ‌య్ అగ‌ర్వాల్… ఇలా కొంత‌మంది పెద్ద‌లు రాహుల్ నివాసానికి వెళ్లి, చ‌ర్చించి వ‌చ్చారు. చ‌ర్చ‌ల ఫలితం… యువ‌రాజుల‌వారు ఇంక‌నూ బెట్టు చేయుచున్నార‌ని మ‌రోప‌ర్యాయం వెల్ల‌డైంది! ఇదే స‌మ‌యంలో… రాహుల్ గాంధీ నాయ‌క‌త్వం వ‌ర్థిల్లాలి, మీరే మాకు దిక్కు, మీరే మాకు మార్గ‌ద‌ర్శ‌కుడు, మీరే లేక‌పోతే మేం న‌డ‌వ‌లేం అంటూ పార్టీ యువ‌జ‌న విభాగం ధ‌ర్నాకి దిగింది. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చాలా చోట నిర‌స‌న‌లు చేయ‌డం మొద‌లుపెట్టేశారు.

ఇంత‌కీ, రాహుల్ గాంధీ అధినాయ‌క‌త్వంపై జ‌రుగుతున్న ఈ చ‌ర్చ ఎక్క‌డ ముగుస్తుంది? ఎలా ముగుస్తుంది… అనేది ఆ పార్టీలో వారికి కూడా క్లారిటీ లేని విష‌యం. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా చూస్తుంటే… ఒక ర‌క‌మైన‌ క్లైమాక్స్ క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల వెలువ‌డిన ద‌గ్గ‌ర్నుంచీ రాహుల్ ని బతిమాల‌డ‌మే సీనియ‌ర్ నేత‌ల ప‌నిగా మారింది. ఇప్పుడు రెండో స్టేజ్.. అంటే, కార్య‌క‌ర్త‌లూ అభిమానులూ నిర‌స‌న‌ల‌కు దిగ‌డం, రాహుల్ నాయ‌క‌త్వం మాకు ఉండి తీరాల్సిందే అనే డిమాండ్ తెర‌మీదికి తేవ‌డం. ఈ నిర‌స‌న‌ల స్థాయి పెరిగిందే అనుకోండి… అప్పుడు రాహుల్ గాంధీ నిమ్మ‌ళంగా దిగొచ్చి, అభిమానుల కోరిక మేర‌కు మేమే అధినాయ‌కులుగా కొన‌సాగుతామ‌ని నిర్ణ‌యించుకోవ‌డం జ‌రిగిందంటూ స్వ‌యం ప్ర‌క‌ట‌న చేసుకోవ‌డం! అంటే, పార్టీకి నేను త‌ప్పు ఎవ్వ‌రూ దిక్కులేరు అనేది అన్ని స్థాయిల్లో బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక‌… అప్పుడు బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం అన్న‌మాట‌. ఇదే జ‌రిగితే ఇంత‌క‌న్నా హాస్యాస్ప‌దం మ‌రొక‌టి ఉండ‌దు.

ఓడిపోయిన వెంట‌నే పార్టీ ప‌గ్గాలు వ‌దిలేయ‌డం నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం అనిపించుకోదు. ఓడిన‌ప్పుడు పార్టీని బ‌ల‌మైన నాయ‌కుడు కావాలి. మ‌రో ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేద్దాం, సంస్థాగ‌త లోపాల‌పై చ‌ర్చించుకుందాం, నా త‌ప్పుల్ని చెప్పండి, ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిల‌బ‌డ‌దాం… ఇలాంటి స్ఫూర్తి రాహుల్ అస్సలు లేదు అనేది ఈ ప్ర‌హ‌నం ద్వారా దేశానికి చాటి చెప్పుకున్నారు. ఇంత జ‌రిగాక‌, తానే మ‌ళ్లీ అధినాయ‌కుడిగా కొన‌సాగాల్సిన ప‌రిస్థితినీ ఓర‌కంగా ఆయ‌నే సృష్టిస్తున్నారు. ఇది పార్టీకి ఏర‌కంగారూ శ్రేయ‌స్క‌రం కాదు. రాహుల్ ఉండ‌నూ అనుకుంటే, మ‌రొక‌ర్ని ఎన్నుకునేంత స్వేచ్ఛ పార్టీకి ఉండాలి. ఒక‌వేళ అదే ఉంటే, మ‌ళ్లీ మ‌ళ్లీ రాహుల్ కొన‌సాగాలీ కొన‌సాగాలీ అనే డిమాండ్ ఎందుకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close