కష్టాలకు తోడు కలహాల్లో ….కాంగ్రెస్‌ మూడు రకాలు

చింత చచ్చినా పులుపు చావదనే సామెత ఎపిసిసి అంతర్గత కలహాల విషయంలో బాగా వర్తిస్తుంది. విభజనానంతర ఎన్నికలలో ఘోరంగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపచేయడానికి కనీసం ఉనికిని కాపాడ్డానికి రఘువీరారెడ్డి బృందం నానా తంటాలు పడుతున్నది. అయితే నంద్యాల కాకినాడ పరాభవాల తర్వాత ఆయనకే అస్తిత్వ సమస్య ఏర్పడింది. ఇలా జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు ముందు నుంచి చెబుతున్నాయి కూడా. తాజాగా రాష్ట్ర పార్టీ మధనం జరిగింది. రఘువీరాను మార్చేయాలని కొందరు వాదిస్తున్నారట. కోండ్రు మురళి, నాదెండ్ల మనోహర్‌, శైలజానాథ్‌ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు పార్టీలో కొనసాగుతారు ఎవరు వైదొలుగుతారనే సందేహాలు కూడా వున్నాయి. వైఎస్‌పీ బిజెపి టిడిపిలు మూడు కోణాల్లో కాంగ్రెస్‌ నేతలను కబళించేందుకు లేదా ఆశ్రయమిచ్చేందుకు వేచి చూస్తున్నాయి. అయితే సంప్రదాయ కాంగ్రెస్‌ వాదులు మాత్రం వైసీపీతో చేతులు కలిపేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అందులోనూ మూడు రకాలు కనిపిస్తున్నారని ఒక సీనియర్‌ నేత చెప్పారు.ఎగతాళికోసం అది తల్లి కాంగ్రెస్‌ అనీ వైసీపీ పిల్ల కాంగ్రెస్‌ అనీ అంటుంటారు గాని వాస్తవానికి ఈ వర్ణన తలకిందులు చేయాలి. ప్రాతినిధ్యమే లేని కాంగ్రెస్‌ కన్నా ప్రధాన ప్రతిపక్షంగా వున్నవైసీపీని తల్లి కాంగ్రెస్‌గా చూడాలని వాస్తవిక వాదులు ఒప్పేసుకుంటున్నారు. అయితే దీనిపై ఏకాభిప్రాయం మాత్రం లేదు. ఈ పొత్తును వ్యతిరేకించే ఒక ముఖ్య నాయకుడు మాజీ ఎంపి మాట్లాడుతూ వైసీపీ పట్ల ఎలా వ్యవమరించాలనేదానిపై తమ పార్టీలో మూడు రకాల ఆలోచనలున్నాయన్నారు. ఒకటి- మొదటి నుంచి ఆపార్టీతో సంబందాలు కాస్త సానుకూల దృష్టి వున్న రఘువీరా, కెపివి రామచంద్రరావు వంటి వారు ఒక రకం. రెండు- రేపు పొత్తు పెట్టుకోవాలన్నా మన బలమంటూ మిగిలితేనే పట్టించుకుంటారు గనక అస్తిత్వం కాపాడుకుంటూ కాస్తప్రభావం పెంచుకోవాలని చెప్పే సీనియర్లు రెండవ రకం. మూడు- రేపు పొత్తు గనక కుదిరితే వైసీపీ మద్దతు కావాలి గనక ఇప్పటి నుంచే లౌక్యంగా వుంటూ వారిపై విమర్శలు చేయొద్దనే వారు మూడవ రకం. మొత్తానికి వైసీపీతో పొత్తే వద్దనే వారు మాత్రం ఎవరూ లేరట. గతంతో పోలిస్తే కొంత ఆకర్షణ కోల్పోయి కేసులు కూడా ఎదుర్కొంటున్న జగన్‌ మరి కాంగ్రెస్‌తో పొత్తు అవసరాన్ని అంగీకరిస్తారా అన్నది ఇప్పటికి తెలియదు తన స్వభావాన్ని బట్టి చూస్తే మాత్రం వారు వస్తే అప్పుడు చూద్దామని దాటేసే అవకాశమే ఎక్కువ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close