బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి.

ఉప ఎన్నికలు వస్తే చాలు అధికార పార్టీ ఆ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించడం ఆనవాయితీగా వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇది పీక్స్ కు చేరుకుంది. కొత్త పథకాలకు రూపకల్పన చేసి మరీ జనాలను అట్రాక్ట్ చేశారు. దీనిపై నాడు కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం ఇతర నియోజకవర్గాలకు కోత విధించి బైపోల్ జరిగే నియోజకవర్గానికి అధిక నిధులు, పథకాలు మళ్ళించడాన్ని సవాల్ చేసింది.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి కంటోన్మెంట్ ప్రజలకు ఆరు వేల ఇందిరమ్మ ఇండ్లను తొలి విడతలో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. నగరంలో మిగతా నియోజకవర్గాలకు 3500 ఇందిరమ ఇండ్లను ఇస్తామని కంటోన్మెంట్ కు మాత్రం అదనంగా 2500ఎక్కువగా ఇవ్వడం వివక్ష కాదా..?అనే చర్చ జరుగుతోంది. ఇది అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడటం ఎలా అవుతుందని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు.

గతంలో విమర్శలు చేసినా, హామీలు ఇచ్చినా ప్రస్తుతం కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలవడమే కాంగ్రెస్ టార్గెట్ అని.. అందుకోసమే ఆ నియోజకవర్గానికి ప్రియార్టి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాళ్ళిద్దరికీ వెయ్యి దండాలు: ప్రభాస్

''కమల్ సర్, అమితాబ్ సర్ తో పని చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేసినందుకు కమల్ సర్ కి, అమితాబ్ సర్ వెయ్యి దండాలు'' అన్నారు ప్రభాస్....

ఇంత‌కీ బుజ్జీ ఎలా ఉంది?

బుజ్జి... బుజ్జి.. బుజ్జి.. నాలుగైదు రోజులుగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ క‌ల‌వ‌రిస్తున్న పేరు. ఈ బుజ్జి ఎవ‌రు? ఈ బుజ్జీకీ 'క‌ల్కి' సినిమాకీ సంబంధం ఏమిటి? అనే ప్ర‌శ్న‌లు, సందేహాల‌తో సోష‌ల్ మీడియాని...

బెంగ‌ళూరు క‌థ ముగిసె!

ఈ ఐపీఎల్ లో బెంగ‌ళూరు క‌థ స‌మాప్త‌మైంది. మ‌రో సీజ‌న్‌ని రిక్త హ‌స్తాల‌తోనే ముగించింది. బుధ‌వారం జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. రెండో ఎలిమినేట‌ర్‌లో రాజ‌స్థాన్ హైద‌రాబాద్ జ‌ట్లు...

పిన్నెల్లి అరెస్టు పేరుతో రోజంతా డ్రామా నడిపిన పోలీసులు !

ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి స్థాయిలో ధ్రిల్లర్ డ్రామాను నడపడంలో అద్భుతమైన విజయం సాధించారు. మొదట పిన్నెల్లి కార్లు పట్టుకున్నారు. తర్వాత ఆయనను చేజింగ్ చేస్తున్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. తర్వాత అరెస్ట్ చేశామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close