కుంతియా… పీసీసీకి అడ్డు పుల్లయ్యా…!

కుంతియా. కాంగ్రెస్ రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి మూలస్థంభమైన ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయ అనుచరుడు. ఆ కుటుంబం కూడా కుంతియాను తమ మనిషిగానే పరిగణించింది. దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తినా అక్కడకు కుంతియాను పంపించి సమస్యను పరిష్కరించేది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కుంతియా ప్రభ మరింత వెలిగింది. రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కుంతియాను సంప్రదించకుండా ముందుకు వెళ్లరనే పేరుంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఈ రాష్ట్ర బాధ్యతలను రాహుల్ గాంధీ తన అనుచరుడు కుంతియాకు అప్పగించారని పార్టీ సీనియర్లు చెబుతారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇక్కడే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిక్కొచ్చిపడింది. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో జాప్యం చేయడం వెనుక కుంతియా పాత్ర ఉందని పార్టీ సీనియర్ నాయకులు అనుమానిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఏ ఒక్కరూ తనను సంతృప్తి పరచడం లేదని కుంతియా అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కుంతియా పీసీసీ అధ్యక్షుడిగా వేరొకరిని నియమించే ప్రక్రియలో తన వంతు రాజకీయాలు నడుపుతున్నారని పార్టీ సీనియర్లు అంటున్నారు. పీసీసీ అధ్యక్ష రేసులో దాదాపు ఐదుగురు సీనియర్ నాయకులు ఉన్నారు. వారిలో ఎవరినీ ఎంపిక చేయాలన్నా కుంతియా ఆమోదముద్ర కావాల్సి ఉంటుంది. తన వద్ద ఉన్న ఆ అస్త్రాన్ని అధిష్టానం వద్ద ప్రయోగిస్తూ అధ్యక్ష పదవికి ఎంపికలో కుంతియా కాలయాపన చేస్తున్నారని పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. దీని వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హస్తం కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుంతియా.. ఈ రాజకీయాలు ఏందయ్యా అని తలలు పట్టుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close