జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రారంభ ట్రెండ్స్ వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలోనూ హోరాహోరీగా కనిపించింది. సింగిల్ డిజిట్ తేడాతోనే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తర్వాత షేక్ పేట నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ వెనుకబడిపోతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా షేక్ పేటలోనూ కాంగ్రెస్ పార్టీ లీగ్ చూపించింది.
మొదటి రెండు రౌండ్లు షేక్ పేట డివిజన్ లో కౌంటింగ్ అయినా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత వెయ్యి ఓట్లకుపైగా ఉంది. తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం అంతకంతకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మూడు రౌండ్లకు మూడు వేల ఓట్ల ఆధిక్యత కనిపిస్తోంది. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఇరవై వేల ఓట్ల వరకూ మెజార్టీ వస్తాయని అంచనా వేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఫలితాలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని.. పోలింగ్ రోజు నుంచే వారు చేస్తున్న ప్రకటనలతో అర్థమైపోతుంది. అందుకే ఈ ఫలితం పట్ల బీఆర్ఎస్ కూడా పెద్దగా ఆశ్చర్యపోయే అవకాశం లేదు. అక్రమాల వల్ల గెలిచారని ప్రచారం చేసే వ్యూహం పాటించే అవకాశం ఉంది.


