రేవంత్ ఒంటరి పోరు: కలిసి చేయరా మీరు

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్కడే ఉద్యమం చేస్తారా..? తెలంగాణలో ఉన్న మిగిలిన కాంగ్రెస్ నాయకులు ఎవరు ఆయనకు కలిసి రారా..? పదవుల కోసం పైరవీలు చేయడం తప్ప.. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయరా..? ఇవన్ని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను అడుగుతున్న ప్రశ్నలు. తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం, పార్టీ నుంచి గెలిచిన వారిని కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం చేసుకోవడం వంటివి జరిగినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం పైపై ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం పై నిర్దిష్టమైన ఉద్యమం చేయటం లేదంటూ అధిష్టానం కాంగ్రెస్ నాయకులపై మండిపడుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి నాకు ఇవ్వండి అని కొందరు, ఫలానా వారికి ఇవ్వండి అంటూ మరికొందరు పైరవీలు చేస్తున్నారే తప్ప ప్రభుత్వ నిర్ణయాలపై ఎలాంటి ఉద్యమం చేయడం లేదంటూ పార్టీ సుప్రీం సోనియాగాంధీ తెలంగాణ నాయకుల వద్ద మండిపడినట్లు సమాచారం.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమం చేయకపోవడం మాట దేవుడెరుగు.. ఆ పని చేస్తున్న రేవంత్ రెడ్డికి కూడా ఎవరూ సహకరించడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడినట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలోనే కాదు మరో 50 సంవత్సరాల వరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని హెచ్చరించినట్టు సమాచారం. గ్రూపుల గొడవలే పార్టీని నాశనం చేస్తున్నాయి అనే వాస్తవం తెలుసుకోవాలని, వీటికి పుల్ స్టాప్ పెట్టి పార్టీ కోసం పని చేయండి అని సోనియా గాంధీ హితవు పలికినట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close