కేరళ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడిగా ఉంటూ…. ఎమ్మెల్యేగా కూడా గెలిచిన రాహుల్ అనే యువనేతను కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కొద్ది రోజుల కిందట.. రీని జార్జ్ అనే నటి తనను జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తీవ్రంగా వేధిస్తున్నారని మూడేళ్ల నుంచి ఆ వేధింపులు భరించలేకపోతున్నానని ఆరోపించారు. మీడియాలో ఈ అంశం వైరల్ అయింది. నటి .. నేరుగా రాహుల్ పేరు చెప్పలేదు. కానీ అందరికీ ఆయనేనని అర్థమైపోయింది.
ఎమ్మెల్యే రాహుల్ టెలిగ్రామ్ , సోషల్ మీడియా ద్వారా రీని జార్జ్‌కు అశ్లీలమైన, లైంగిక వేధింపుల కిందకు వచ్చే సందేశాలు పంపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆమె హెచ్చరించినా ఆగలేదు. హోటల్ రూమ్‌కు రావాలని.. అక్కడ “ప్రైవేట్ మీటింగ్” జరుపుకుందామని ఓ సారి ఆహ్వానించాడు. ఆమె తిరస్కరించడంతో వేధింపులను ఇంకా పెంచాడు. లేట్ నైట్ కాల్స్, లైంగిక సూచనలతో కూడిన సంభాషణలు చేశాడని. ఆమెను “సెక్సువల్ ఫ్రస్ట్రేషన్”తో బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.
కానీ ఆమె తన స్నేహితురాలు అని.. రీని జార్జ్ చేసిన ఆరోపణలు తన గురించి కాదని రాహుల్ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఎవరూ వినడం లేదు. రాహుల్ కాదు అని రీని జార్జ్ కూడా ప్రకటించకపోవడంతో ఆయనేనని అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వేచి చూస్తూ వచ్చింది. ప్రజాగ్రహం ఎక్కువగా ఉండే సరికి.. మొదటగా ఆయనను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. నిరసనలు చల్లారకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.