కర్ణాటకలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన పేరు కేసీ నరేంద్ర. బెట్టింగ్ , గేమింగ్ యాప్‌లను నిషేధించిన తర్వాత వాటిని ఇల్లీగల్‌గా ఆపరేట్ చేస్తున్న వారిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేసీ నరేంద్ర దొరికిపోయాడు. అతని ఇంట్లో ఈడీ చేసిన సోదాల్లో 12 కోట్ల నగదు , బంగారు, వెండి, లగ్జరీ కార్లు వంటి అక్రమాస్తులు బయటపడ్డాయి.
ఇల్లీగల్ ఆన్లైన్ , ఆఫ్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ వంటి వాటిలో నరేంద్ర సిద్ధహస్తుడు. దుబాయ్ నుండి సోదరుడు కేసీ తిప్పేస్వామి, కొడుకు పృథ్వీ ఎన్ రాజ్ సపోర్ట్‌తో పెద్ద నెట్ వర్క్ నడిపిస్తున్నారు. ఈడీ మొత్తం 30 చోట్ల తనిఖీలు చేసింది. 1 కోటి వరకు ఫారెన్ కరెన్సీ కూడా ఉంది. ఎమ్మెల్యే నరేంద్ర నేరుగా King567, Raja567, Puppys003, Rathna Gaming పేర్లతో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను నడుపుతున్నాడు. గోవాలో అతనికి 5 క్యాసినోలు ఉన్నట్లుగా గుర్తించారు. దుబాయ్‌లో కాల్ సెంటర్లు ద్వారా వ్యాపారాన్ని మానిటర్ చేస్తున్నారు. ఇవి గేమింగ్ బిజినెస్ కాల్ సెంటర్లుగా పని చేస్తున్నాయి.
బెట్టింగ్ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును లాండరింగ్ చేసి, అక్రమాస్తులుగా మార్చారు. కర్ణాటకలో ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ గురించి ఫిర్యాదులు రావడంతో ఈడీ ఆరా తీసింది. కేసీ వీరేంద్ర, అతని ఫ్యామిలీ దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నారని గుర్తించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ బెట్టింగ్ ఎమ్మెల్యే వ్యవహారం చిక్కులు తెచ్చి పెట్టింది.