ఎన్టీవీలో ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్‌కు వివాహేతర బంధం అంట గట్టేసి చేసిన ప్రచారం ఇప్పుడు పెను వివాదంగా మారింది. అది ఉద్దేశపూర్వకంగా రాయించిన కథనం. ఎన్టీవీలో ఆఫ్ ది రికార్డ్ అనేది ఎన్టీవీ అధినేత చౌదరి తన రాజకీయ బాసుల మెప్పు పొందేందుకు వారి ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారాలు చేయడానికి పెట్టుకున్న కార్యక్రమం అని ఆ చానల్లోనే చెప్పుకుంటారు. ఎవరిపై ఎలాంటి ప్రచారాలు చేయాలో ఆయన ఆఫీస్ నుంచి సూచనలు వస్తాయి. అలాంటి ప్రోగ్రాంలో కోమటిరెడ్డిని టార్గెట్ చేశారు. అయితే ఆయనను టార్గెట్ చేయడానికి ఓ మహిళా ఐఏఎస్‌ను బలి చేయడమే ఇక్కడ రివర్స్ అయింది.
ప్లాన్ ప్రకారమే రేవంత్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు
ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్‌కు వివాహేతర బంధం అంటగట్టడం చిన్న విషయంకాదు. పెను దుమారం రేపుతుంది. అంతకు ముందు రాజ్ న్యూస్ అనే చానల్లో ఇలాంటి పుకార్లు రేపేవాళ్లు. పట్టించుకోకపోతూండటంతో ఈ సారి ఎన్టీవీని ప్రయోగించారు. వెంటనే ఆ వీడియోను తీసుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేసింది. ఆ మంత్రి ఎవరో.. ఐ ఐఎఎస్ ఎవరో సింపుల్ గా తెలిసిపోయేలా ప్రచారం చేశారు. అంటే ఓ ప్లాన్ ప్రకారం అంతా జరిగిందన్నమాట. మంత్రిపై నిందలేయడం అంటే రాజకీయం అవుతుందేమో కానీ.. మహిళా ఐఏఎస్ క్యారెక్టర్‌ను కించ పరిచి ఆమె కుటుంబంలో చిచ్చుపెట్టడం మాత్రం రాజకీయం అవదు..దుర్మార్గం అవుతుంది. అదే ఇప్పుడు మెడకు చుట్టుకుంది.
భట్టి విక్రమార్క తో సన్నిహితంగా ఉండే చానల్ యజమాని
పెద్ద ఇష్యూ అయ్యే సరికి ఆ చానల్ రేవంత్ రెడ్డికి సన్నిహితం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ చానల్ ఓనర్ ఎలాంటి వాడో రాజకీయాల్లో అందరికీ తెలుసు. ఆయన ఎవరికి సన్నిహితుడో కూడా అందరికీ తెలుసు. కాంగ్రెస్ గెలవగానే భట్టివిక్రమార్కను సీఎం చేయాలంటూ ఉద్యమం నడిపారు. రేవంత్ కు వ్యతిరేకంగా కథనాలు రాశారు. డిప్యూటీ సీఎం భట్టితో ఖమ్మంకే చెందిన నరేంద్ర చౌదరి చాలా క్లోజ్ గా ఉంటారు. ఇరువురు కలిసి పర్యటనలు కూడా చేస్తారు. అలాంటి జిగ్రిదోస్తు ఉన్న ప్రభుత్వంలో .. మంత్రిపై ఇలాంటి కథనం తన చానల్లో రాయించారంటే.. రాజకీయ కుట్రలు లేకుండా ఉంటాయా?
లెక్క తేల్చనున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు
మీడియా చానల్ పెట్టుకుందే ..దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవడం కోసం అన్నట్లుగా ఉంటుంది ఎన్టీవీ యాజమాన్యం తీరు. అవినీతిపరులకు అండగా నిలవడం .. ఇష్టం లేని వాళ్లపై తప్పుడు ప్రచారాలు చేయడానికి సంకోచించరు. అలాంటి మీడియాలకు ఎప్పటికైనా ఎదురుదెబ్బలు తప్పు. ఇప్పుడు మహిళా ఐఏఎస్ పై కథనంతో ఈ చానల్ చేయకూడని తప్పు చేసింది. చేసిన తప్పులన్నింటికీ ఇప్పుడు శిక్ష అనుభవించే సమయం వచ్చిసినట్లయింది. ఐఏఎస్, ఐపీఎస్‌లు తల్చుకుంటే.. ఎన్టీవీ యజమాని చరిత్ర ఎపిసోడ్లుగా తెరపైకి వస్తుంది. అదే జరిగే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
