ఏం చేసినా సరే ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదని కొంత మంది భయంకరమైన కుట్రలు చేస్తున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అయినా సరే పెట్టుబడిదారుల్ని రాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పుడు మెయిల్స్, రాష్ట్రంపై తప్పుడు ప్రచారంతో పాటు కోర్టుల్లోనూ పిటిషన్లు వేస్తున్నారు. వీరి వ్యవహారంతో ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. దీని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది?. రాష్ట్రానికి అన్యాయం చేసి ఏం బావుకుంటారు?. ప్రజల్ని బాగుపడకుండా చేసి ఏం సాధిస్తారు ?
పరిశ్రమలకు భూ కేటాయింపులపై కోర్టుల్లో పిటిషన్లు
పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని వివాదాస్పదం చేస్తూ.. కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. తప్పుడు పిటిషన్లు వేశారని గతంలో సుప్రీంకోర్టు చేత చీవాట్లు తిన్న వ్యక్తులే ఇష్టానుసారంగా భూకేటాయింపులపై పిటిషన్లు వేస్తున్నారు. చివరికి టీసీఎస్ కంపెనీకి ఇచ్చిన భూములపైనా పిటిషన్లు వేశారు. లులు కంపెనీకి ఇస్తున్న భూములపైనా పిటిషన్లు వేస్తున్నారు. వీరి వ్యవహారం చూస్తూంటే.. ప్రతి విషయాన్ని వివాదం చేయాలని అనుకుంటున్నట్లుగా అర్థమయిపోతుంది. దీని వల్ల వారికి ఏం వస్తుందో మాత్రం చెప్పలేము కానీ.. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రను ఉన్నత స్థాయిలో చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
పరిశ్రమలకు భూములు .. పరిశ్రమల కోసమే !
ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు కేటాయించడం సహజం. వాటికి ఎంత ధర అనేది.. ఆయా పరిశ్రమల వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు, రాష్ట్రానికి జరిగే మేలును బట్టి డిసైడ్ చేస్తారు. టీసీఎస్ పరిశ్రమ రావడం వల్ల విశాఖలో సాఫ్ట్ వేర్ రంగం బాగా విస్తరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దాని వల్ల జరిగే లాభం ముందు ఆ సంస్థకు కేటాయించే భూముల విలువ ఎంత ?. అప్పటికే ఆ భూముల్లో కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేవు. ఇళ్లు కట్టి అమ్మలేవు. కనీసం హోటల్స్ కూడా కట్టవు. సాఫ్ట్ వేర్ ఆఫీసులు మాత్రమే పెడతారు. అలాగే ఏ పరిశ్రమకు భూములు కేటాయించినా ఆ పరిశ్రమల కోసం మాత్రమే వినియోగించాలి .లేకపోతే నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భూముల్ని వెనక్కి తీసుకుంటారు.
తప్పుడు మెయిల్స్ – అడ్డగోలు పిటిషన్లు
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తూంటే.. ఆసక్తి చూపించేవారిని బెదిరించేందుకు జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అన్ని కుట్రలకు పాల్పడుతోంది. రాష్ట్రంలో అలజడి సృష్టించి శాంతిభద్రతలు లేవని ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఈమెయిల్స్ పెట్టుబడిదారులకు పంపుతున్నారు. ఇప్పుడు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. వీరి ఉద్దేశం ఏపీకి పెట్టుబడులు రాకూడదు.. యువతకు ఉద్యోగాలు రాకూడదు.. ఏపీ బాగుపడకూడదు. ఎందుకంటే.. బాగుపడితే ప్రజలు తమకు ఓట్లు వేయరేమో అని కంగారు పడుతున్నారు. వాళ్లను దిగువ స్థాయిలో నిరుపేదలుగా ఉంచితేనే తమకు ఓటు బ్యాంకుగా ఉంటారని అనుకుంటున్నారు. వీరి కుట్రలను గుర్తించి బుద్ది చెప్పాల్సింది ప్రజలే .