2022 రివైండర్: కాంట్రవ‌ర్సీ ఆఫ్ ది ఇయ‌ర్

2022లో తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్ రేట్ల వివాదం ఒక కుదుపు కుదిపింది. చిత్ర పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు పెద్ద దూమారనికే దారి తీశాయి. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లని దారుణంగా తగ్గించేయడంతో ఈ వివాదం మొదలైయింది. ”థియేటర్‌ కౌంటర్‌ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కౌంటర్‌ కలెక్షన్ ఎక్కువ” అని తొలిసారి ఈ వివాదంపై ఘాటుగా స్పందించిన హీరోగా నాని నిలుచాడు. తర్వాత ఒకొక్కరు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలని వెల్లడించారు. ఇలా స్వేఛ్చగా అభిప్రాయాలు వెల్లడించిన వారిపై కూడా ఎదురుదాడి జరిగింది.

మంత్రితో వర్మ మీటింగ్: చాలా విషయాలపై తిక్కతిక్కగా స్పందించే రామ్ గోపాల్ వర్మ.. టికెట్ రేట్ల విషయంలో చాలా బలమైన గొంతుక వినిపించాడు. ”సినిమాల టికెట్ల ధరలకు విధించినట్లే రాష్ట్రంలో ఇంకేదైనా ఉత్పత్తిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందా? ఒక వేళ విధించి ఉంటే ఆ ఉత్పత్తుల పేర్లు, అందుకు కారణాలు తెలపాలి.? ఒక నటుడికి నిర్మాత ఎంత పారితోషికం చెల్లిస్తున్నారనే విషయంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి? ఒకవేళ ప్రజలపై ప్రభుత్వానికి మమకారం ఉంటే, ఎవరైతే సినిమా టికెట్‌ను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయలేరో వారికి సంక్షేమ పథకం కింద ప్రభుత్వమే రాయితీ కల్పించి విక్రయించవచ్చు కదా!” ఇలా వరుస ట్వీట్లు పెట్టారు వర్మ. ఆయన ట్వీట్లలో లాజిక్ వుందని నెటిజన్స్ కూడా అర్ధం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం తరపున అప్పటి మంత్రి పేర్నీ నాని, వర్మని మీటింగ్ కి పిలిచారు. మీటింగ్ కి వెళ్ళిన వర్మ .. ”అసలు సినిమా పరిశ్రమ ఎలా పని చేస్తుందో ప్రభుత్వానికి కనీస పరిజ్ఞానం లేదు” అని తేల్చేశారు.

ప్రభుత్వం టికెట్ల అమ్మకం- పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ స్పీచ్: ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తుందనే విధానం పై కూడా పెద్ద చర్చ జరిగింది. రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్.. ఈ వివాదాన్ని రాజకీయ మలుపు తిప్పింది. ”ప్రైవేట్‌ పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి?” అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ . ”నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతా వారి సినిమాల జోలికి రావొద్దు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచనలో ఉంది. సినిమా టికెట్ల ఆదాయం చూపి బ్యాంకు రుణాలు తీసుకునే యోచన ఉంది” అని పవన్ చేసిన ఘాటు వాఖ్య వివాదాన్ని మరింత రాజేసింది.

చిరంజీవికి అవమానమా?: టికెట్ రేట్లు, ప్రభుత్వం టికెట్ల అమ్మకాలు, రాయితీలు, అదనపు షోలు.. ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కోసం అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవితో సహా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లారు. అయితే ఈ భేటి నుండి విడుదలైన ఒక వీడియో చాలా మందిని బాధించింది. చిరంజీవి చేతులు జోడించి ప్రార్దించడం, దానికి ముఖ్యమంత్రి స్థానంలో జగన్ మోహన్ రెడ్డి తీరు తీవ్రమైన చర్చకు దారి తీసింది.

చిత్ర పరిశ్రమని కించపరచడమే: చిత్ర పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీరుని తప్పుపట్టారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమను కించపరిచే విధంగా వ్యవహరించిదని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమపై సమస్యలు సృష్టించి సినిమా హీరోలను అవమాన పరిచారని, స్వశక్తితో ఎదిగిన చిరంజీవి లాంటి వారు ఏపీ సీఎం జగన్‌ వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ప్రాధేయపడలా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినీ పరిశ్రమను జగన్‌ కించపరిచే విధంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు.

పవన్ వెర్సస్ ప్రభుత్వం: టికెట్ రేట్లు, ఆన్ లైన్ లో విక్రయాలు, అదనపు షోలు.. ఇలా ఏపీ ప్రభుత్వం చేసే ఆలోచనలు చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమాల చుట్టూనే తిరిగాయనేది ఓపెన్ సీక్రెట్. ఏపీ ప్రభుత్వం కారణంగా పరిశ్రమ చుట్టూ నెలకొన్న వివాదాలు ప్రస్తుతానికి సద్దుమణిగాయి. భారీగా తగ్గించేసిన టికెట్ ధరలు మాత్రం యాధావిధిగా చేశారు. మళ్ళీ పాత జీవోనే అమలు చేశారు. మిగతా అంశాలని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమైతే .. మళ్ళీ ఈ వివాదాలు తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

బీజేపీ పెద్దల నుంచి కోమటిరెడ్డి కోరుతున్న హామీ ఏంటి !?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే బీజేపీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. గడ్కరీ, అమిత్ షా, మోదీలను మార్చి మార్చి కలుస్తున్నారు. ఏమిటంటే తన నియోజకవర్గం పనుల కోసమని చెబుతున్నారు. ఏ బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close