బాలు రాత్రే చ‌నిపోయారా?

ఈరోజు మ‌ధ్యాహ్నం 1.04 గంట‌ల‌కు బాలు మ‌ర‌ణ వార్త‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్‌. దాంతో ఏ మూలనో మిణుకుమిణుకుమంటున్న ఆశ‌ల‌న్నీ ఆవిరైపోయాయి. దేశాన్ని త‌న గానంతో ఉర్రూత‌లూగించిన ఓ మ‌హాగాయ‌కుడి మ‌ర‌ణం సంగీత ప్రియుల్ని విషాద సాగ‌రంలో ముంచెత్తింది. అయితే నిజానికి బాలు నిన్న రాత్రే తుది శ్వాస విడిచార‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని డాక్ట‌ర్లు సైతం కుటుంబ స‌భ్యుల‌కు చెప్పేశార‌ని, ఆర‌కంగానే మీడియాకూ స‌మాచారం అందింద‌ని తెలుస్తోంది. అయితే… సంప్ర‌దాయాల్ని, ముహూర్తాల్నీ అమితంగా న‌మ్మే కుటుంబ స‌భ్యులు ఈరోజు మ‌ధ్యాహ్నం 1.04 నిమిషాల‌కు ఈ మ‌ర‌ణ వార్త‌ని అధికారికంగా చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నార్ట‌. అందుకే.. సరిగ్గా అదే స‌మ‌యానికి చ‌ర‌ణ్ మీడియా ముందుకు వ‌చ్చారు. ఈరోజు సాయింత్ర‌మే బాలు అంత్య‌క్రియ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం భౌతికకాయాన్ని ఆసుప‌త్రి నుంచి పొడంబాకంలో ఉన్న ఆయ‌న స్వ‌గృహానికి త‌ర‌లించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

HOT NEWS

[X] Close
[X] Close