‘పుష్ష‌’పై కాపీ మ‌ర‌క‌

పెద్ద పెద్ద సినిమాల‌కు `కాపీ` బెడ‌ద‌లు త‌ప్ప‌డం లేదు. రిలీజ్ కి ముందో, త‌ర‌వాతో… షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడో ‘ఈ క‌థ నాదే’ అంటూ ఎవ‌రో ఒక‌రు అడ్డుత‌గ‌ల‌డం ష‌రా మామూలైంది. ఈసారీ `పుష్స‌` విష‌యంలో ఈ మ‌ర‌క కాస్త ముందుగానే ప‌డిపోయింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పుష్ఫ‌’. ఈ సినిమా క‌థ నాదే.. అంటూ ఓ ర‌చ‌యిత ఇప్పుడు గళం విప్పుతున్నారు. ఆయ‌న సాదాసీదా ర‌చ‌యితో, అనామ‌కుడో కాదు. కేంద్ర సాహిత్య యువ పుర‌స్కారాన్ని అందుకున్న ర‌చ‌యిత‌.. వేంప‌ల్లి గంగాధర్‌.

2008లో తాను రాసిన ‘త‌మిళ కూలీ’ క‌థ‌నే ‘పుష్ష‌’గా తీస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఇది కూడా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే కథే. అట‌వీ నేప‌థ్యంలో సాగుతుంది. ఆ క‌థనే అటూ ఇటూ మార్చి `పుష్ష‌`గా తీస్తున్నార‌న్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌. ఇది వ‌ర‌కు `అర‌వింద స‌మేత‌`పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేశారు. తాను రాసిన ‘మొండి క‌త్తి’ క‌థ‌లో 5 రూపాయ‌ల ఫ్యాక్ష‌న్ నేప‌థ్యాన్ని రాశారు. దాన్నే… `అర‌వింద స‌మేత‌`లోనూ చూపించారు. అప్పుడు ఈ ర‌చ‌యిత గ‌ళం విప్పినా, సినిమా విడుద‌లై, బ‌య‌ట‌కువ‌చ్చేసింది కాబ‌ట్టి.. ఏం చేయ‌లేక‌పోయారు. అందుకే.. ఇప్పుడు ముందుగానే పోరాటానికి సిద్ధ‌మ‌య్యారీయ‌న‌. మ‌రి.. దీనికి సుకుమార్ అండ్ టీమ్ ఏ స‌మాధానం చెబుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close