వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ… సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే – క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి చాలా పెద్ద టీమ్ ఉంది. త‌ను సెట్ కి వెళ్ల‌క‌పోయినా, షూటింగ్ స‌జావుగా జ‌రిపేంత క్రూ ఉంది. వర్మ‌నే న‌మ్ముకుని, సంవ‌త్స‌రాలుగా వ‌ర్మ‌తో ట్రావెల్ అవుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. వ‌ర్మ బ‌లం, బ‌ల‌గం వాళ్లే.

అయితే అలాంటి టీమ్ లో ఓ కీల‌క‌మైన స‌భ్యుడికి క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. దాంతో వ‌ర్మ టీమ్ అలెర్ట్ అయిపోయింది. ఎక్క‌డ ప‌నులు అక్క‌డే ఆపేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌ర్మ రెండు మూడు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. అన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం తీస్తున్న‌వే. వాటి ప‌నుల‌న్నీ వ‌ర్మ ఇప్పుడు ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. టీమ్ లోకి మిగిలిన స‌భ్యుల‌కూ క‌రోనా టెస్టులు చేయిస్తున్నార్ట‌. రోగాల‌కూ, వైర‌స్ ల‌కూ, మ‌నుషుల‌కూ, స‌మాజానికి భ‌య‌ప‌డ‌ని వ‌ర్మ టెస్టులు చేయించుకుంటాడో లేదో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

ట‌బుని ఒప్పించ‌డం సాధ్య‌మా?

కొన్ని క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. ఆ ఫీల్ ని క్యారీ చేయ‌డం, ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ రీ క్రియేట్ చేయ‌డం సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పాత్ర‌ల‌కు స‌రితూగే న‌టీన‌టుల్ని వెదికి...

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

HOT NEWS

[X] Close
[X] Close