మునిగిపోతున్న భారీ సినిమాలు

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ తోనే చిత్ర‌సీమ స‌గం చితికిపోయింది. ఆ ప్ర‌భావం త‌గ్గి, థియేట‌ర్లు మ‌ళ్లీ తెర‌చుకుని, సినిమాలు వ‌రుస క‌ట్టి, వ‌రుస‌గా నెల‌కో హిట్టు ప‌డుతుంటే – టాలీవుడ్ మ‌ళ్లీ గాడిన ప‌డిన‌ట్టే అనిపించింది. ఆ ఆశ‌ల‌పై సెకండ్ వేవ్ పూర్తిగా నీళ్లు చ‌ల్లేసింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్ని చూస్తుంటే… టాలీవుడ్ కి గ‌డ్డు కాలం ఎదుర‌వుతోంద‌న్న సంకేతాలు గ‌ట్టిగానే క‌నిపిస్తున్నాయి. ఈ ప్ర‌భావం పెద్ద సినిమాల‌పై విప‌రీతంగా ప‌డే అవ‌కాశం ఉంది.

ఈ సీజ‌న్ లో రావాల‌నుకున్న సినిమాలు ఆచార్య‌, అఖండ‌, రాధేశ్యామ్, ఆర్‌.ఆర్‌.ఆర్ చాలా ముఖ్య‌మైన‌వి. ఇవి భారీ బ‌డ్జెట్ సినిమాలు. వీటిపై… సెకండ్ వేవ్ తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. గ‌త ఏడాది క‌రోనా వ‌ల్ల‌.. ఆగిపోయిన సినిమాల్లో ఇవీ ఉన్నాయి. అప్ప‌టి నుంచీ… ప‌లుమార్లు షూటింగులు వాయిదా ప‌డుతూ, విడుద‌ల తేదీలు మార్చుకుంటూ… చిత్రీక‌ర‌ణ‌లు జ‌రుపుకుంటూ వ‌స్తున్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ ఈ షూటింగుల‌కు బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ ఈ సినిమాల విడుద‌ల తేదీలు మారడం ఖాయం. సినిమా ఆల‌స్య‌మ‌య్యే కొద్దీ… బ‌డ్జెట్లు పెరుగుతూ పోతాయి. ఒక‌టీ, రెండు నెల‌లు సినిమా ఆగిందంటే ఫ‌ర్వాలేదు. నెల‌ల త‌ర‌బ‌డి, నిర్విరామంగా సినిమాలు ఆగుతూ పోతే, అనుకున్న బ‌డ్జెట్ కీ, సినిమా పూర్త‌య్యే ట‌ప్ప‌టికి క‌నిపించే అంకెల‌కూ అస్స‌లు సంబంధ‌మే ఉండ‌దు.

పైగా ఈ సినిమాల కోసం భారీ సెట్లు వేశారు. అవ‌న్నీ సినిమాలు పూర్త‌య్యే వ‌ర‌కూ అలానే ఉండాలి. అదో అద‌న‌పు ఖ‌ర్చు. ఫైనాన్స్ తెచ్చుకుంటే.. వ‌డ్డీలు త‌డిచి మోపెడు అవుతుంటాయి. క‌రోనా క‌ష్టాల్ని అధిగ‌మించి చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసినా, విడుద‌ల స‌మ‌యానికి ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందో చెప్ప‌లేం. 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే గానీ, పెద్ద సినిమాలు బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్సు లేదు. మ‌రో క‌నిపించ‌ని క‌ష్టం ఏమిటంటే.. సంవ‌త్స‌రాలు త‌ర‌బ‌డి చిత్రీక‌ర‌ణ‌లు జ‌రుపుకూనే ఉంటుంటే.. ఆయా సినిమాల‌పై ఉన్న క్రేజ్ త‌గ్గుతూ ఉంటుంది. పైగా హీరోల లుక్ యేడాదికేడాది మారుతూ ఉంటుంది. అవ‌న్నీ సినిమాపై ప‌రోక్షంగా ప్ర‌భావం చూపిస్తుంటాయి. ఎటు చూసినా… నిర్మాత‌ల‌కు ఇది క‌ష్ట కాల‌మే. మునుముందు మంచి రోజులు వ‌స్తాయ‌న్న భ‌రోసాతో ఉండ‌డం త‌ప్ప‌, ఇప్పుడు ఎవ‌రూ ఏం చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు బ‌ర్త్ డే గిఫ్టులు.. ఓ రేంజ్‌లో!

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. అందుకోసం చిరు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి బ‌ర్త్ డే గిఫ్టులు ఓ రేంజ్‌లో ఉండ‌బోతున్నాయి. చిరు న‌టిస్తున్న మూడు సినిమాలు ఇప్పుడు...

‘బింబిసార 2’.. టార్గెట్ ఫిక్స్‌!

'బింబిసార' త‌ర‌వాత పార్ట్ 2 వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. కానీ ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. 'ముందు బింబిసార 1 హిట్ట‌వ్వాలి క‌దా..' అనుకొన్నారు. తీరా చూస్తే `బింబిసార` సూప‌ర్ హిట్ట‌య్యిపోయింది....

గోరంట్ల వీడియోపై కాదు టీడీపీ ఫోరెన్సిక్ రిపోర్టుపై సీఐడీ విచారణ !

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను సమర్థించేందుకు చివరికి ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది. ప్రభుత్వం ఆ వీడియోను ఫోరెన్సిక్ టెస్ట్ చేయించేది లేదని తేల్చేయడంతో టీడీపీ నేతలు అమెరికాలోని ఎక్లిప్స్ అనే...

హ‌ను రాఘ‌వ‌పూడి.. నెక్ట్ ఏంటి?

'సీతారామం'తో... ఓ సూప‌ర్ స‌క్సెస్ కొట్టాడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఈ విజువ‌ల్ బ్యూటీకి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇది వ‌ర‌కు కూడా హ‌నుకి హిట్లు ఉన్నాయి. కానీ... ఇంత గౌర‌వం ఎప్పుడూ రాలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close