రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న స్తబ్ధత కారణంగా ఇళ్ల కొనుగోలుదారులకు బేరమాడే శక్తి వచ్చింది. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లు ఉండటంతో బిల్డర్లు కూడా ఎంతో కొంత తగ్గించుకుని అయినా ఫ్లాట్లు అమ్మేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే బయ్యర్లు పలు విధాలుగా డిస్కౌంట్ల కోసం ప్రయత్నించవచ్చు. ఇలాంటి వాటిలో ఒకటి కార్పొరేట్ డిస్కౌంట్. చాలా సందర్భాలలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు లేదా బిల్డర్లు కార్పొరేట్ ఉద్యోగులకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో పని చేస్తున్న కంపెనీతో ఒప్పందం లేకుండానే ఇస్తూంటారు.
చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రముఖ MNCలు, IT కంపెనీలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, లేదా పెద్ద కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తాయి. దీనికికారణం వీరు ప్రధాన కొనుగోలుదారులు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల కోసం డెవలపర్లతో ఒప్పందాలు కూడా చేసుకుంటాయి. ఫ్లాట్ ధరలో 15 శాతం వరకూ డిస్కౌంట్ ఇచ్చే చాన్స్ ఉంది. ఉచిత కార్ పార్కింగ్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, ఫర్నిచర్/మోడ్యులర్ కిచెన్ ఉచితం, EMIలపై రాయితీలు వంటి ఆఫర్లు ఇందులో ఉండవచ్చు.
బిల్డర్‌తో సంప్రదించి, వారి కార్పొరేట్ డిస్కౌంట్ స్కీమ్ గురించి అతెలుసుకోవాలి. అదే ప్రాంతంలోని ఇతర ప్రాజెక్ట్‌ల ఆఫర్లను పోల్చుకుని బిల్డర్‌తో చర్చలు జరపి మరింత తగ్గించుకోవచ్చు. హైదరాబాద్‌లో, TCS, ఇన్ఫోసిస్, గూగుల్ వంటి సంస్థల ఉద్యోగులకు మై హోమ్, అపర్ణా కన్స్ట్రక్షన్స్ వంటి బిల్డర్లు 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ లేదా ఉచిత అమెనిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
ఆకాశహర్మ్యాల్లో అయితే ఫ్లోర్ రైజ్ ధరను విధిస్తారు. దాన్ని తగ్గించుకోవచ్చు. ఉచిత ఇంటీరియర్స్, వుడ్ వర్క్ లేదా ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ ఇవ్వమని అడగవచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్ అని బిల్డర్ చెబితే కంగారు ఆడాల్సిన పని లేదు. అన్నీ చూసుకుని కొనుగోలు చేసుకుంటే.. లక్షల్లో ఆదా అవుతుంది.