మీడియా వాచ్ : “మెరుగైన” రేటింగ్స్‌ కోసం అడ్డదారులు..!

తెలుగుతో ప్రారంభమైన ఇతర భాషలకు.. హిందీకి విస్తరించిన ఓ చానల్ నెట్ వర్క్ మెరుగైన రేటింగ్స్‌ కోసం అడ్డదారులు తొక్కినట్లుగా తేలింది. చానల్ రేటింగ్స్‌ను లెక్కించే సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కొన్సిల్ ..బార్క్‌లోని వారికే తాయిలాలు ఆశ చూపి.. ఈ అడ్డమైన పనికి పాల్పడినట్లుగా తేలింది. దీంతో బార్క్‌లో కీలక స్థానాల్లో ఉన్న రొమిల్ రంగారియా, సుజిత్ సామ్రాట్ అనే ఇద్దరి నుంచి రాజీనామా పత్రాలను తీసుకున్నారు. ఉన్న పళంగా ఆమోదించారు. ఈ విషయాన్ని బార్క్ సభ్యులందరికీ..తెలియచేశారు. ఎందుకు వారిని బార్క్ నుంచి బయటకు పంపారో .. ఆ సంస్థ చైర్మన్ నుంచి క్లారిటీ రాకపోయినప్పటికీ.. కొద్ది రోజులుగా.. జరుగుతున్న రేటింగ్స్ మ్యానిపులేషన్ గొడవే కారణం అనేది బహిరంగ రహస్యం.

మెరుగైన రేటింగ్స్‌ కోసం… చాలా చానళ్లు చాలా అడ్డదారులు వెదుకుతూ ఉంటాయి. అయితే.. అడ్డదారుల్లో… వ్యాపారాలను విస్తరించుకోవడంలో రాటుదేలిపోయిన… వ్యాపార సామాజ్రాలకు చెందిన చానళ్లు మాత్రం… మీడియాలోనూ అదే బాట పడుతున్నాయి. రేటింగ్స్ ఎక్కువగా వస్తే.. ప్రకటనలు కూడా ఎక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో రేటింగ్స్‌ను మ్యానిపులేట్ చేసేందుకు డబ్బులు వెదజల్లారు. గతంలో… అయితే… బార్క్.. ఎక్కడ అయితే.. బాక్సులు పెడుతుందో.. ఆయా ఇళ్లలోని వారికి డబ్బులు ఇచ్చి.. ఎక్కువ సేపు చానల్ ఉండేలా చూసేవారు. కానీ..ఇదంతా తలనొప్పి అనుకున్నారేమే కానీ..నేరుగా బార్క్ అధికారులతోనే డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

మెరుగైన రేటింగ్ కోసం తహతహలాడుతున్న ఆ నెట్ వర్క్ .. హిందీ చానల్ అట్టర్ ఫ్లాప్‌గా మారింది. కనీస మాత్రం రేటింగ్స్ రావడం లేదు. అయితే.. ఇలాంటి పరిస్థితి నుండి ఒక్క సారిగా.. జూమ్ అయిపోయింది. టాప్ రేటింగ్ కు వెళ్లిపోయింది. అప్పుడే… మీడియాకు సర్కిల్స్‌లో.. బార్క్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మ్యానిపులేషన్ జరుగుతోందని… విచారణ కు డిమాండ్లు వెళ్లాయి. అంతర్గతం విచారణ జరిపించిన బార్క్ చివరికి.. ఇద్దరి దగ్గర రాజీనామాలు తీసుకుంది. ఈ మెరుగైన రేటింగ్ తాపత్రయం.. మొత్తం బార్క్ వ్యవస్థ .. రేటింగ్‌ల మీద నమ్మకం పోయేలా చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల్లూరు ఎస్పీపై ఎమ్మెల్యే తిట్ల వర్షం..!

పోలీసులంటే వైసీపీ చోటా నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఎంత చులకనో.. తరచూ బయటపడుతోంది. ఉండవల్లి శ్రీదేవి లాంటి ఎమ్మెల్యేలు సీఐలపై విరుచుకుపడితే... కాస్త సీనియర్లైనా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలాంటి వాళ్లు ఏకంగా...

సినిమాల‌కూ.. ర‌జ‌నీ గుడ్ బై?!

అభిమానుల ద‌శాబ్దాల కోరిక‌ను.. త‌న అనారోగ్య కార‌ణాల‌తో ప‌క్క‌న పెట్టేశాడు ర‌జ‌నీకాంత్. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా - వ‌చ్చేస్తున్నా - అని ఊరించీ, ఊరించీ... చివ‌రికి హ్యాండ్ ఇచ్చాడు. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఏమ‌య్యేదో...

పవన్ ఓటు బ్యాంక్‌పై కన్నేసిన బీజేపీ..!

పవన్ కల్యాణ్‌ అడిగి మరీ పొత్తు పెట్టుకున్నారు. దానికి బీజేపీ ఇస్తున్న బహుమానం ఏమిటంటే.. ఆయనకుఓటు బ్యాంక్‌గా ఉంటున్న వారిని ఆకర్షించడానికి ప్రత్యేకంగా మిషన్ ప్రారంభించడం. అవునన్నా... కాదన్నా.. పవన్ కల్యాణ్ ప్రధాన...

‘తాండ‌వ్‌’పై.. హిందూ సెగ‌

సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లూ `మ‌నో భావాల‌`ను గ‌ట్టిగా దెబ్బ తీయ‌డం మొద‌లెట్టాయి. తాజాగా.. `తాండ‌వ్‌` పై ఓ వ‌ర్గం క‌న్నెర్ర చేస్తోంది. ఈనెల‌ 15న అమెజాన్ ప్రైమ్ లో తాండవ్ వెబ్...

HOT NEWS

[X] Close
[X] Close