రవిప్రకాష్ కస్టడీకి కోర్టు నిరాకరణ…!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. రవిప్రకాష్‌ను కస్టడీకి తీసుకుని ఎలాంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కోర్టుకు స్పష్టత ఇవ్వడంలో పోలీసులు విఫలమయ్యారు. వరుసగా కొన్ని రోజుల పాటు వివరాలు సమర్పించేందుకు వాయిదాలు కోరిన పోలీసులు ..చివరికి సమర్థవంతమైన వాదన వినిపించలేకపోయారు. ఈ కారణంగా న్యాయమూర్తి ..రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్‌ను కొట్టేశారు. సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాష్.. ఏబీసీఎల్ కంపెనీ నుంచి అక్రమంగా బోనస్ డ్రా చేసుకున్నారంటూ.. అలంద మీడియా సంస్థ తరపున సింగారావు ఫిర్యాదు చేశారు.

దీంతో ఐదో తేదీన రవిప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా… పండగ ముందుగా అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలో… బోనస్ రూపంలో.. రవిప్రకాష్ తో పాటు ఇతరులు తీసుకున్న రూ. 18 కోట్లు ఎటు వెళ్లాయో తెలుసుకుంటామంటూ పోలీసులు కస్టడి పిటిషన్ వేశారు. దీనిపై వాదనల్లో రవిప్రకాష్ తరపు న్యాయవాదులు… ఉద్యోగులు అందరికీ వచ్చినట్లుగానే బోనస్ వచ్చిందని ఆధారాలు చూపించారు. అదే సమయంలో ఈ వివాదం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఉందని… న్యాయమూర్తికి వివరించారు.

ఈ క్రమంలో.. న్యాయమూర్తి నిర్ణయం పోలీసులకు షాక్ ఇచ్చినట్లయింది. సాధారణంగా… ఏదైనా కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసి.. కస్టడీ అడిగితే.. కోర్టులు ఇస్తాయి. అసాధారణంగా… ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినట్లయితేనే… కస్టడీని తిరస్కరిస్తారు. రవిప్రకాష్ విషయంలో బంజారాహిల్స్ పోలీసులు కనీస ఆధారాలు కూడా చూపించలేకపోయారని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close