సింపుల్‌గా బయటకొచ్చేసిన చీకోటి ముఠా !

ధాయ్‌ల్యాండ్‌లో దొరకినా చీకోటి ప్రవీణ్ ముఠా సింపుల్‌గా బయటకు వచ్చేసింది. రూ. వెయ్యి ఫైన్ కట్టించుకుని అక్కడి కోర్టు అందర్నీ వదిలేసింది. దాంతో అందరూ ఇండియా బాట పట్టారు. నిజానికి అక్కడ చట్టాల గురించి నెట్ లో వెదికి మరీ వారికి ఏడాది వరకూ జైలు శిక్ష పడుతుందని.. చాలా మీడియా సంస్థలు జోస్యం చెప్పాయి. కానీ అంత మాత్రం పవర్ ఫుల్ వ్యక్తుల అండ లేకుండానే థాయ్ వెళ్లి మరీ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ ఆడతారా అని ఆలోచించలకపోయారు. ఒక్క రాత్రి మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు. తెల్లవారే సరికి బయటకు వచ్చేశారు.

అయితే ఇండియాలో జరగాల్సినంత రచ్చ జరిగిపోయింది.అందులో ఉన్న కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా చీకోటి ప్రవీణ్ ను ప్రత్యేకంగా సీటువేసి కూర్చోబెట్టిన ఫోటో వైరల్ అయింది. ఇలా బెయిల్ వచ్చిన వెంటనే.. అలా ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడి తానుఆర్గనైజర్ ను కాదని.. తానే ఆడటానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. పోకర్ టోర్నమెంట్ అని.. లీగల్ అని చెప్పడం వల్ల వెళ్లానని అంటున్నారు. అయితే అసలు టోర్మెంట్ నిర్వాహకుడు ఆయనేనని.. ఇప్పటి వరకూ జరిగిన టోర్నమెంట్ల గురించి తెలిసిన వాళ్లు నమ్ముతున్నారు.

ఇలాంటి గ్యాంబ్లింగ్ లలో వందల కోట్లు చేతులు మారుతున్న అంశం సామాన్య ప్రజల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. డబ్బులు అన్నీ ఇక్కడే కట్టి.. టోకెన్లు తీసుకోవాలి. అలా కట్టేదంతా బ్లాక్ మనీనే. మళ్లీ అక్కడ టోర్నమెంట్‌లో గెలిచి నతర్వాత ఎన్ని టోకెన్లు తీసుకు వచ్చి ఇస్తే అన్ని టోకెన్లకు ఇక్కడ డబ్బులు చెల్లిస్తారు. ఇదంతా హవాలా రాకెట్ అన్న అనుమానాలున్నాయి. అయితే చిన్న జరిమానాతో వారంతా ఇండియాకు వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ మీడియాలో జరిగిన ప్రచారంతో కొంత మందికి పబ్లిసిటీ దక్కింది..మరి కొంత మందికి పరువు పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close