ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారం ఇండియాలోకి రాగానే ఇక్కడా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయన్న రిపోర్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా మొత్తం మీద 260 కరోనా కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్టులు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు కేసులు వెలుగు చూశాయి. విశాఖలో ఒకటి , కడపలో ఒకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో ఓ డాక్టర్ కు సోకినట్లుగా తేల్చారు. వీరెవరికి ట్రావెల్ హిస్టరీ లేదు.
ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతూ సూచనలు జారీ చేసింది. బహింగప్రదేశాల్లో మాస్కులు వాడాలని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా అడ్వయిజరీ జారీ చేయలేదు. కరోనా ఎంత సీరియస్ అన్నది ఎవరికీ తెలియదు. విశాఖలో నమోదైన కరోనా పాజిటివ్ డిశ్చార్జ్ కూడా అయినట్లుగా తెలుస్తోంది. కరోనా కంటే.. కరోనా సోకుతుందన్న భయమే ఎక్కువ ప్రాణాంతకంగా మారుతోంది.
కరోనా పెరిగిపోయిందని భావిస్తే ప్రతి చిన్న అనారోగ్యానికి కరోనానే కారణం అని ప్రజలు ఆందోళన చెందుతారు. దీని వల్ల మెడికల్ మాఫియా లాభపడుతుంది. టెస్టులు, ఐసోలేషన్, చికిత్స పేరుతో పేషంట్లను దోపిడీ చేస్తారు.గతంలో మూడు సార్లు అలాగే జరిగింది. ఇప్పుడు అలాగే జరుగుతుందా లేకపోతే ప్రజలు మామూలు జలుబు లాగే ట్రీట్ చేసి వదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది.