బిగ్ బాస్ బ్రోతల్ హవుస్ అంటూ ఆ షోపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నేత నారాయణపై ఆ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున సెటైర్లు వేస్తున్నారు. షోలోనే ఇద్దరు కంటెస్టెంట్ల చేత గట్టిగా కౌగిలించుకోమని చెప్పి… చేయించేశారు. అలా చేసిన తర్వాత .. నారాయణ..నారాయణ వారిద్దరూ భార్యభర్తలంటూ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లలో మెరీనా – రోహిత్ భార్యభర్తలు. వారితోనే హగ్ ఇప్పించుకోమని చెప్పిన నాగార్జున తర్వాత ఆ కామెంట్ చేశారు. భార్యభర్తలు ఎలాగైనా చేసుకోవచ్చని.. వారికి ఆ లైసెన్స్ ఉందని నాగార్జున చెప్పదల్చుకున్నారు . బిగ్ బాస్ హౌస్లో అలాంటివి చేయడానికి లైసెన్స్ ఉందని నాగార్జున చెప్పినట్లయింది.
అయితే నాగార్జున సెటైర్లు అర్థం చేసుకోనంత అమాయకుడేం సీపీఐ నారాయణ కాదు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు కౌంటర్ ఇస్తారు. భార్యభర్తలైతే మాత్రం బహిరంగంగా చేస్తారా అనే డౌట్ అందరికీ వస్తుంది. మరి భార్యభర్తలు కాని వాళ్లు కూడా చేస్తున్నారు కదా వారి సంగతేంటనేది మరో డౌట్. ఇలాంటివి నారాయణకు తెలియనివి కాదు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరింత రెచ్చిపోతారు. బిగ్ బాస్ షోకు కావాల్సింది కూడా అదేనేమో కానీ ఉద్దేశపూర్వకగా నారాయణను నాగార్జున మాక్ చేసినట్లుగా స్పష్టమవుతుంది.
ఈ సీజన్ బిగ్బాస్ ఎప్పట్లా హైలెట్ కావడంలేదు. ప్రారంభానికి కూడా పెద్దగా హైప్ లేదు. గత ఏడాదికి.. ఈ ఏడాదికి పోలిస్తే.. ఓటీటీల హవా ఎక్కువ పెరిగింది. ఈ కారణంగా బిగ్ బాస్ టాప్ ప్రయారిటీలోకి రాలేదన్న వాదన వినిపిస్తోంది. పైగా కంటెస్టెంట్లు కూడా ఎవరికీ పెద్దగా తెలిసిన వాళ్లు కాదు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న వాళ్లు కాదు. దీంతో హైప్ కోసం వివాదాలు సృష్టించాలన్న ప్రణాళికతోనే నాగార్జున నారాయణను మాక్ చేసినట్లుగా కనిపిస్తోంది.