ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరు మీద ఉంది. దీంతో భారతీయ రియల్ ఎస్టేట్ డెవలపర్ల కాన్ఫెడరేషన్ CREDAI విశాఖపట్నం ఛాప్టర్, డిసెంబర్ 19 నుంచి 21 వరకు తన 11వ ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఎక్స్ పో ఉంటుంది. 70 నుంచి 72 స్టాల్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. 100కి పైగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు, లగ్జరీ హోమ్స్, గేటెడ్ కమ్యూనిటీల వంటి వివిధ ఆప్షన్లు ఉంటాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లతో నేరుగా కొనుగోలుదారులు కనెక్ట్ అవ్వడానికి ఒక కామన్ ప్లాట్‌ఫాం అందిస్తుంది.
ప్లాటినం, ప్రీమియం డైమండ్, డైమండ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పెర్ల్ వంటి కేటగిరీల్లో స్టాల్స్‌ను విభజించి, బ్యాంకులు స్పెషల్ డిస్కౌంట్లు, ఎక్స్క్లూసివ్ డీల్స్, ఇన్స్టంట్ లోన్ అప్రూవల్స్‌ను అందిస్తాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ , విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాల్స్ కూడా ఉంటాయి. నగరం చుట్టూ జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి వివరాలు ప్రదర్శిస్తారు.
ఎకో-ఫ్రెండ్లీ అపార్ట్మెంట్లు, హౌస్ కన్స్ట్రక్షన్పై జ్ఞాన సెషన్లు, గంటకు ఒకసారి లక్కీ డ్రాస్లు, ఒక బంపర్ ప్రైజ్‌లు కూడా ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఎక్స్‌పోకు ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది. నవంబర్ 3న నగరంలోని ఒక హోటల్లో ఈ ఎక్స్‌పోకు కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది. విశాఖపట్నం రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ ఎక్స్పో పెద్ద ఆకర్షణ కలిగించనుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. విశాఖలో ఇల్లు, స్థలం కొనాలనుకునేవారు ఈ ఎక్స్ పోను సందర్శిస్తే చాలా విషయాలపై అవగాహన పెరిగే అవకాశం ఉంది.