ఒకఇంద్రాణి,ఒక షీనా,మధ్యలో రాహుల్…ఇదీ స్టోరీ

`ఏంటీ ! ఇది స్టోరీనా… ?!’ మండిపడ్డాడు. వెంగళప్ప.

`అవును, ఇదే స్టోరీ’ రెట్టించాడు జంబులింగం.

`ఊరికే పేర్లు చెబితేకాదయ్యా, నాకు కథకావాలి. కథ. ఎంత ఖర్చయినా సరే, చిరంజీవి 150వ చిత్రకథలాగా చాలా డెప్త్ గా ఉండాలి, సరిగా చెప్పు…’ రెట్టించాడు వెంగళప్ప.

`సరే, స్టోరీ లైన్ పొడిగిస్తే … ఇక్కడో ట్విస్ట్ – మర్డర్ ‘

`అహ్హాహ్హా… మర్డర్… ఇది బాగుందయ్యా, చెప్పు స్టోరీ.. ‘

`ఇంద్రాణికి పెళ్లయింది. అలాగే పీటర్ కీ పెళ్ళయింది. అలాగే.. వీళ్లిద్దరీ పెళ్లయింది ‘

`ఎహే, ఇంద్రాణికి పెళ్లయిందన్నావ్, పీటర్ కి పెళ్లయిందన్నావ్. మళ్ళీ వీళ్లిద్దరికీ పెళ్లేంటవేంటయ్యా.. ‘ తలగోక్కున్నాడు వెంగళప్పు.

`మరీ నా కథలో అదే ఇంటరెస్టింగ్. చిరంజీవి తన 150 చిత్రానికి ఈ కథ తీసుకుంటానంటూ తెగ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. నీకు నచ్చితే చెప్పు, లేకపోతే చిరంజీవి తీసేసుకుంటాడు ‘ అన్నాడు సినీస్టోరీ రైటర్ జంబులింగం.

`వద్దు, వద్దు నేనే తీసుకుంటాను. కథ చెప్పు ‘ బ్రతిమిలాడాడు వెంగళప్ప.

`ఇద్దరికీ గతంలో పెళ్లయింది. ఇద్దరిదీ సెకండ్ మేరేజ్ అన్నమాట. ఇక, షీనా మంచి అందగత్తె ? ఇప్పుడు రాహుల్ ఎంటరవుతాడు ‘

`మధ్యలో రాహుల్ ఎక్కడినుంచి వచ్చాడు. జమ్మూలో పరామర్శకు వెళ్ళాడుకదా…’ తనకూ కరెంట్ టాపిక్స్ బాగా తెలుసన్నట్టు అదోలా ఫోజిచ్చి అన్నాడు వెంగళప్ప.

`ఆ రాహుల్ కాదెహె… మన స్టోరీలో రాహుల్ కుడా అందగాడు. అతను షీనాను చూశాడు. ప్రేమలో పడ్డాడు ‘

`ఓ లవ్ స్టోరీ అన్నమాట ‘

`కాదు, ఇక్కడో ట్విస్ట్. మధ్యలో మర్డర్ ‘

`ఎంటీ, మర్డరా… !’ఎగిరిగంతేశాడు వెంగళప్ప. అంటే, ఇది క్రైమ్ స్టోరీనా?

`క్రైముంది. కానీ మధ్యలో సెంటిమెంటల్ ట్విస్ట్ ‘

`అదేంటీ ? ‘

`మొత్తం కథంతా ఊరికే చెప్పేస్తానా ఏంటీ, తీయ్ అడ్వాన్స్ గా ఓ 50వేలు ఇచ్చుకో. కథ నచ్చితే తర్వాత ఎమౌంట్ ఇచ్చేద్దువుగానీ, అవతల చిరంజీవి…’

`వద్దు, చిరంజీవికి ఇవ్వొద్దు. నేనే తీసుకుంటాను. ఇందా 50వేలు. కథ చెప్పు. ఏంటీ ఆ సెంటిమెంటల్ ట్విస్ట్ ? ‘ అమాయకంగా అడిగాడు వెంగళప్ప.

`కథలో అప్పుడు, ముకెర్జీయా… ‘

`ఈయనెవరూ…!? ‘

`మరదే, ఊరికే తొందరపడకయ్యా, నా కథలో ఎన్నో ట్విస్ట్ లూ, మరెన్నో సెంటిమెంట్సూనూ… పీటర్ గురించి చెప్పానుకదా, అతని పూర్తిపేరు పీటర్ ముకెర్జీయా అన్నమాట.. ‘

`ఓహా…! ‘

`పీటర్ ముకెర్జీయాకు ఇంద్రాణితో పెళ్ళికావడానికి ముందే మరొకామెతో పెళ్లియిందని చెప్పానుకదా. వీరిద్దరికి పుట్టినవాడు రాహుల్. ఈ రాహుల్, షీనాను ప్రేమించాడు. షీనా కూడా ప్రేమలో పడింది ‘

`సూపర్. ఇక చాలు నాకంతా అర్థమైంది. లవ్ సాంగ్ వేసుకోవచ్చు ‘

`ఇక్కడో ట్విస్ట్ ‘

`మళ్ళీ ట్విస్టా…? చెప్పుచెప్పు… ‘

`ఇంద్రాణి తన భర్త పీటర్ ముకెర్జీయాకు షీనాను పరిచయం చేస్తూ ఆమె తన చెల్లెలని అని చెప్పింది’

`ఎట్టా ! అంటే రాహుల్ కు షీనా వరసకు… ‘

`అప్పుడే ఆశ్చర్యపోకు, మరో ట్విస్ట్ ‘

`ఇంకో ట్విస్టా !? ‘

`మరి అదే ఈ జంబులింగం కథ చెప్పాడంటే ట్విస్ట్ లమీద ట్విస్టులే… ఆఁ.. సరిగా అప్పుడు షీనా హత్యకు గురవుతుంది. ఆమె శవాన్ని ముక్కలుముక్కలుగా కోసి ఒక అడవి ప్రాంతంలో పాతరపెట్టేస్తారు’

`అమ్మో…అంటే దెయ్యం ఎంటరవుతుందా !? ‘

`కథలో దెయ్యంలేదు. షీనాను చంపింది ఎవరో తెలుసా ? ‘

`ఎవరూ… ??? ‘

`ఇంద్రాణి ‘

`ఎంటీ !! సొంత చెల్లెల్ని చంపేసిందా ? అమ్మో, ఈ ట్విస్ట్ మరీ ఇంటరెస్టింగాఉందే… ‘

`ఇంద్రాణికి షీనా చెల్లెలు కాదు ‘

`చెల్లెలు కాదా ! ఇందాక ఇంద్రాణి తన భర్త పీటర్ కు షీనాను పరిచయం చేస్తూ చెల్లెలని చెప్పిందన్నావుగా…!? ‘

`అన్నాను. కానీ ఇక్కడ మరో ట్విస్ట్. అందుకే మార్చేస్తున్నాను ‘

`ఎంటీ, ట్విస్ట్ కోసం వరసలు మార్చేస్తావా… సరే, చెప్పు.. ‘

`షీనా, రాహుల్ ప్రేమించుకున్నారు. ఈ సంబంధం ఇంద్రాణికి నచ్చలేదు. అంతే, హత్యచేసి శవాన్ని కారు డ్రైవర్ సాయంతో ముక్కలుముక్కలుగా కోసేసి కారడవిలో పాతరపెట్టేసింది ‘

`అమ్మో, ఎంత రాక్షసి ‘

`పోలీసులు ఎంటరవుతారు. కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. కారు డ్రైవర్ అనుమానాస్పద ప్రవర్తనతో తీగలాగితే డొంకంతా కదులుతుంది. చివరకు ఇంద్రాణి తానే ఈ హత్యచేశానని ఒప్పుకుంటుంది. మళ్ళీ ఇక్కడో ట్విస్ట్.. ‘

`ఓర్నాయనో, ఇన్ని ట్విస్టులా.. సూపర్ కథ. కలెక్షన్స్ లో బాహుబలిని మించిపోవడం ఖాయం…చెప్పుచెప్పు…’ ఉత్సాహంతో ఊగిపోయాడు వెంగళప్ప.

`షీనా తన చెల్లెలు కాదనీ, ఆమె తన కూతురని ఇంద్రాణి పోలీసుకు చెప్పింది. గతంలో తాను తప్పు చెప్పానని కూడా అంగీకరిస్తుంది. తన కూతురు షీనా, రాహుల్ సంబంధం పెట్టుకోవడం నచ్చకే హత్యచేశానని చెబుతుంది’

`అవునూ, షీనా వరుసకు రాహుల్ కు…ఛీ..ఛీఛీ.. ‘

`ఇప్పుడు ఎంటర్ అవుతాడు… మిఖేల్ బోరా’

అప్పటికే కథలోని ట్విస్ట్ లు భరించలేని వెంగళప్ప అసహనంతో…
`మధ్యలో వీడెవడయ్యా….!!??’ తలపట్టుకున్నాడు.

`ఇతను షీనాకు సోదరుడు’

అప్పటికే వెంగళప్ప, నేలమీద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు.

`ఇది స్టోరీనా…ఇక చెప్పకు వినలేను. హ్హీహ్హీహ్హీ… ఒక ఇంద్రాణి…ఒక పీటర్… ఒక షీనా…మధ్యలో రాహుల్… హ్హీహ్హీహ్హీ…ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్.. బిగ్ ట్విస్ట్ మీద మరో బిగ్ ట్విస్ట్….ఓర్నాయనో, నేను తట్టుకోలేను. ఇన్ని ట్విస్టుల సినిమాకథ నాకొద్దూ, ఆ చిరంజీవికి ఇచ్చేసుకో..నేను వస్తా…’
– అంటూ వెంగళప్ప వెళ్లిపోతుంటే…

`ఆగు వెంగళప్పా, ఇంకో ట్విస్ట్ మిగిలేఉంది…. మధ్యలో ముఖేష్ అంబానీ..’

ఆ మాటలు వింటూనే వెంగళప్ప నొరెళ్లబెట్టి పరుగోపరుగు.

జంబులింగం నవ్వుకున్నాడు. మరోసారి టివీలో నేషనల్ ఛానెల్స్ ట్యూన్ చేస్తూ పోతున్నాడు. ఇంకా ఇంద్రాణి మర్డర్ కేసు వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. చేతిలో 50వేలను ప్రేమగాతడిమాడు, నేషనల్ ఛానెల్స్ కి థాంక్స్ చెప్పుకుంటూ…

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close