ఆంధ్రాలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు వాడే భాషకు , తెలుగు భాష మీద దాడి మన సంస్కృతి మన సమాజం మన సంప్రదాయాల మీద కడకు మన జాతి మీద కూడా దాడి అనేది ముమ్మాటికి నిజం.
తెలుగు భాషకు సేవ చేసిన మహనీయులు భాషను సజీవంగా భావితరాలకు అందించటం అనేది మన భాద్యత కూడా, నాయకులు ఈ విషయాన్ని ఆలోచించండి, తెలుగు భాష అనేది నెమ్మదిగా వికసించిన సంస్కృతికి ప్రతిభింబం. ప్రపంచంలో అతి పురాతనమైన, సంగీతాత్మక భాషలలో తెలుగు భాష ఒకటి. ఈ భాషకు ఉన్న గొప్పతనం కేవలం దాని వ్యాకరణ పరిమాణం వల్లనే కాదు – దానిని ప్రేమించి, పరిరక్షించి, ప్రాణాలే పణంగా పెట్టిన మహనీయుల వల్లే తెలుగు బాష వికసించింది.
విజయనగర సామ్రాజ్యాధీసులు “శ్రీ కృష్ణదేవరాయలు” తాను రచించిన ఆముక్తమాల్యద అనే తెలుగు కావ్యంలో “తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ నె రుగనే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స. “.అని తెలుగు భాషను కీర్తించినారు.
పద కవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు వేల సంకీర్తనలతో తెలుగు రచించి తెలుగు భాష పామరులకు కూడా అర్ధంమైన రీతిలో అందించినటువంటి గాన సంకీర్తన కోవిదుడు.
ఇటలీకి చెందిన యాత్రికుడు మరియు జ్ఞాన పరిశోధకుడు నికోలే డ్యూకాంటి –తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అభివర్ణించారు,గిడుగు రామమూర్తి పంతులు – వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు గారు (1863–1940) తెలుగు భాషకు సేవ చేసిన గొప్ప భాషా శోధకుడు, విద్యావేత్త, సామాజిక సంస్కర్త. తెలుగును ప్రజల భాషగా మార్చాలనే లక్ష్యంతో వాడుక భాషా ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రాచీన కాలంలో గ్రాంథిక తెలుగు ఉండేది. అది సామాన్య ప్రజలకు క్లిష్టంగా ఉండటాన్ని గమనించిన గిడుగు గారు “విద్య అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలి” అనే సిద్ధాంతంతో వాడుక భాషను విధ్యాభాషగా ప్రోత్సహించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు – ఆంధ్ర కేసరి
టంగుటూరి ప్రకాశం పంతులు గారు (1872–1957) తెలుగు ప్రజలకు స్వాతంత్ర్య సమార యోధుడిగా తెలుగు భాషాభిమానిగా ఆయనకు “ఆంధ్ర కేసరి” అనే బిరుదు ధైర్యసాహసాలకు గుర్తుగా లభించినప్పటికీ, తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. తెలుగు భాషను విద్యాభాషగా, పరిపాలనా భాషగా స్థాపించాలన్నది ఆయన ఆశయం.
పొట్టి శ్రీరాములు – భాష కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు
పొట్టి శ్రీరాములు గారు (1901 మార్చి 16 – 1952 డిసెంబరు 15) తెలుగు భాష మాట్లాడే వారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు. ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవారు. సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.
ఇంకా మరెందరో తెలుగు భాషను ప్రజల గుండెల్లో నిలిపారు, తెలుగుకు వన్నె తెచ్చారు ఇలాంటి మహనీయుల కృషి వల్లే మన తెలుగు భాష ఒక వెలుగు వెలిగింది. వారి తపన, త్యాగం, పోరాటం ద్వారా మన భాష సమృద్ధిగా వికసించింది. తెలుగు భాషను రక్షించడమేగాక, గౌరవించాలన్న బాధ్యతను కూడా మనం వారినుంచి నేర్చుకోవాలి. భాష అనేది మన సంస్కృతి, మన ఆత్మగౌరవం. అలాంటి భాషకు సేవచేసిన మహానుభావులను మనం స్మరించుకోవడమే కాదు, వారి ఆశయాలను కొనసాగించడమూ మన బాధ్యతే.”
“మా తెలుగు తల్లికి మల్లెపూదండ” ఈ పాటను 1942 లో దీనబందు సినిమా కోసం శంకరంబాడి సుందరాచారి రచించగా, టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించారు. “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” ఆ గీతమే తరువాత కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయబడినది.
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు సదరు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను ఊరూ వాడ వినిపించినారు. విశేష ప్రాచుర్యం కల్పంచారు. తెలుగును స్పృశించి తెలంగాణా ఆంధ్ర రాయలసీమ అధికారంలోకి రావటానికి ఆయనకి తెలుగు భాష మీద ఉన్న పట్టు ఒక కారణం
తెలుగు భాష గొప్పతనాన్ని బట్టి ఏర్పాటు అయిన ఆంధ్రరాష్ట్రము లో 2019–2024 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగు భాషపై తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ప్రతి తెలుగువారిని ఆవేదనకు గురిచేశాయి.
భాషా ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రంలో, అదే భాషను నిర్లక్ష్యం చేయడం ఏమిటి?
తెలుగు మాట్లాడే మనమే, తెలుగుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే!
భాషను అవమానించడం, కించపరచడంకంటే దారుణం మరొకటి లేదు. దానికోసం భారతీయ శిక్షా స్మృతి లో సెక్షన్లను మార్చాల్సిన అవసరం ఉంది. శాసనసభలో ఈ విషయం పై కూలంకషంగా చేర్చించి, దీనిపై చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా సోధరీమణుల పట్ల అభ్యంతరకరముగా వ్యాక్యలు చేయడం చాలా భాదాకరం. విమర్శించే విశ్లేషకులు ఇలాంటి అభ్యంతర కరమైన వ్యాక్యలు చేయడం సమాజానికి మంచిది కాదు, ఇటువంటి విశ్లేషకుల వలన సమాజానికి ఉపయోగం ఏమిటి?
మీడియా అంటే సమాజానికి ఒక మంచి మార్గాన్ని చూపేది. మీడియా అంటే ప్రజల హితాన్ని కోరేది మీడియా అంటే ప్రజలకు కావలసిన విషయాన్ని ప్రభుత్వం వరకు చేరవేసేది. ప్రభుత్వానికి, ప్రజలకు అదే విధంగా పార్టీలకు ప్రజలకు వారిదిగా ఉండేదే మీడియా కొన్ని మీడియాలలో స్త్రీలని విమర్శించడం స్త్రీలని అవమానించడం స్త్రీల యొక్క విలువను దిగజార్చే విధంగా వ్యాక్యలు చేయడం మనం ఈ మధ్యన చూస్తున్నాం మీడియాలో ఇలాంటివి చేయడం మంచి పరిణామం కాదు, మీడియా తీరు కూడా మారవలసిన అవసరం ఉన్నది. వార్తాపత్రికలు ఉన్నప్పుడు పౌర సమాజంలోని కొంతమంది నాయకులు మాట్లాడే అనాగరిక భాషను. ప్రచురించేవారు కూడా కాదు అదేవిధంగా, సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డు ఉన్నట్టే మీడియాకు కూడా కొన్ని పరిమితులు ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళను మీడియా అడ్డుకోవాలి. పోలీస్ సెక్షన్స్ కూడా మార్చాలి అవసరమైతే కటినంగా చర్యలు ఉండాలి ఇప్పుడు ఉన్న సెక్షన్స్ ఎట్టి పరిస్థితిలో సరిపోవు. చట్టం లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని కొద్ది మంది మంత్రులు కొంతమంది శాసనశాబ్యులు అనలిస్ట్ గా బోర్డు పెడితే అందరుఇట్లా తిట్టుకుంటూ వెళితే ఈ పరిస్థితితులు ఏవిదంగా దిగాజారుతాయో ప్రతి ఆంధ్రుడు ఆలోచించాల్సిన అంశం ఈ సమాజం కోసం మనం ఏమి చెప్తున్నాం, రాజకీయ నాయకులుగా ఉండి రాజకీయ పార్టి నాయకుడు తప్పు చేస్తే ఖండించాల్సినది పోయి, ఆ తప్పును వెనకేసుకొచ్చిన పరిస్థితి, జగన్మోహన రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తెలుగు భాషకి న్యాయం చేయలేదు వారు వారి సహచర మంత్రులు తెలుగు భాషకు అన్యాయం చేసారనేది వాస్తవం గత ప్రభుత్వంలో, మంత్రులు శాసనసభ సభ్యులు, స్పీకర్ లతో సహా వారు మాట్లాడిన భాషపై ఎవరు చర్యలు తీసుకోలేదు కాబట్టి, వారు ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఈ చట్టాన్ని సవరించడానికి NDA ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భారత శిక్షాస్మృతి ప్రకారం ఏ పరిస్థితిలోనైనా జరిమానాలు విధించవచ్చు. అదేవిధంగా సృష్టి మూలమైన మహిళలపై వ్యాఖ్యలు చేయడం నాగరికతకు అవమానం. అమరావతి మహిళలను కించపరిచిన ఒక విశ్లేషకుడి వ్యాఖ్యలను ఖండించి మౌనంగా ఉండిపోవటం సరిపోదు. అతన్ని చట్టపరంగా శిక్షించాలి.
చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రరాష్ట్రంలో తొలిసారిగా బడ్జెట్లో రూ.10కోట్ల రూపాయలు కేటాయించినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు. తెలుగు భాషను సరిదిద్దడానికి చంద్రబాబు గారు కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే, తెలుగు ప్రజలు కూడా నేటి కొంత మంది రాజకీయనాయకులు వాడే భాషను చూసి వారిని “అజ్ఞానులు”(Idiots) గా భావించే పరిస్థితి వచ్చింది. వీరు రాజకీయాలను దిగజార్చి, శాసనసభ స్థాయిని, గౌరవాన్ని, తెలుగు భాషను దిగజార్చి రాష్ట్ర పరువును దిగజాజర్చటం అభ్యంతరకరము. జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే YSRCP నాయకులందరికీ తెలుగు క్లాసులు (Spoken Telugu ) కోర్సులు పెట్టి నాగరిక భాషను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పక్షం రోజుల క్రితం అమరావతి స్త్రీ ల పై చేసిన వ్యాక్యలు అవమానంగా భావించాల్సిన బాధ్యత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారి పైన ఉంది. మొదట, ఇది ఒక ఫ్యాషన్‌గా ప్రారంభమైంది. చివరగా, తెలుగు భాషను ఎగతాళి చేస్తున్న పరిస్థితి, తెలుగుతల్లికి శోకం మిగిల్చే పరిస్థితి దీని కోసమా! తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసింది?
లోకేష్ గారు, మాజీ మంత్రి, రోజా చీర, గాజులు పంపిస్తాను అంటే దాన్ని ఖండించాడే. తప్ప వారిపై ఎవిదమైన అభ్యంతరకర వ్యాక్యలను చేసి ఉండలేదు అదేవిధంగా, లోకేష్ గారు మహానాడులో ప్రవేసపెట్టిన ఆరు శాసనాలలో స్త్రీ శక్తి ఒకటి. – సృష్టికి మూలం స్త్రీ మూర్తి మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ముందు మనం మనుషులం , మనకు మానవత్వం ముఖ్యం. ఎదుటి వాడు మనకు గౌరవం ఇచ్చేది మన భాషని బట్టి ఉంటుందనే ప్రాథమిక నిజాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి. ఆంధ్రరాష్ట్రంలో నెలకొని ఉంది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు మనం ఎక్కడైనా తెలుగు వాళ్ళమని చెప్పుకుంటే, తెలుగు వాళ్ళు బూతులు తిట్టుకుంటారు అనే పరిస్థితి పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకునే రోజులు ఇంకా ఎక్కువ దూరంలో లేవు అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తెలుగును కాపాడవలసిన భాద్యత ప్రభత్వాల మీద కంటే కూడా ప్రజల మీద ఎక్కువ ఉంది.
YSRCP పార్టి నాయకులకు తెలుగు దేశంపార్టి మీద విమర్శ చేయ మనండి కాని, తెలుగు మీద, తెలుగింటి ఆడపడుచుల మీద విమర్శ చేయవద్దని గట్టిగా సుస్పష్టం గా కోరుతున్నాను.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి పనిచేసిన కాలంలో తెలుగు భాషకి న్యాయం చేయలేదు కాబట్టి, ఆయన తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకై ప్రాణ త్యాగం చేసిన వారిని, తెలుగు భాష కోసం బందరులో లో తోలి తీర్మానం చేసిన బోగరాజు పట్టాబి సీతారామయ్య కు అవమానం జరిగినట్లు నేను భావిస్తున్నాను.
కృష్ణంరాజు మీడియా లో చేసిన ప్రేలాపనలకు చూసి న్యాయవ్యవస్థ కూడా స్పందించాలి. ప్రభుత్వం శాసనసభలో తక్షణం చట్టం చేయటంతో పాటు, రాజకీయ భాష మారాలి, తక్షణం మార్చాలి ,మీడియా డిబేట్ల లో కూడా భాష మారాలి. రాజధాని మహిళ ల పై వ్యాఖ్యలు చేసిన అతని గురించి, అతని మాటల గురించి, నిర్ణయం తీసుకోవాలి గానీ మీడియాలో ఎక్కువగా పునరావృతం చేయకుండా ఉండటమే మన భాషకు మనం ఇచ్చే గౌరవం రేడియో ఉన్నపుడు, పత్రికలున్నప్పుడు పబ్లిష్ చెయ్యండి టీవీ లు వచ్చాక బాష కి అవమానం జరుగుతున్న పరిస్థితి … దీని మీద చర్చ జరగాలి ఎన్టీఆర్ తెలుగింటి ఆడపడుచులకు అని మీటింగ్ ప్రారంభించడం మనం చూశాము.
అఖిలాంధ్ర ప్రజానీకానికి అన్న గారు లోకేష్ కి తాత గారు చూపిన బాటలో స్త్రీ శక్తి 6 శాసనాల్లో పెట్టిన లోకేష్ ని అభినందించాల్సిందే..బాష ప్రయుక్త రాష్ట్రం తెచ్చుకుంది బాషా సౌఖ్యం కోసమా లేక ఇలాంటి బూతులు మాట్లాడటానిక..స్త్రీ లేనిదే జననం.లేదు స్త్రీ సృష్టికి మూలం . కొన్ని మీడియా సంస్థలు తీరు మార్చుకోకపోతే తెలుగు బాష ఎటు పోతుందో తెలియదు
తెలుగు ఇటాలియన్ కి నచ్చింది , కృష్ణ దేవరాయలుకు నచ్చింది. కానీ మన బాష ని మనమే అవమానిస్తే ఏమి చెయ్యాలి ఇలా మాట్లాడటానికి కారణం కొంత మంది యాంకర్ లు కొంత మంది విశ్లేషకులు తెలుగు రాక ఇలా మాట్లాడతున్నారేమో బాష మీద దాడి మొదట మగవాళ్ళని తిట్టి ఇంట్లో ఆడవాళ్లని తిడుతూ మరింత దిగజారుస్తు… నాయకులు గాని , చట్ట సభల్లో నాయకులుగా మాట్లాడుతున్నారు విశ్లేషకులు పార్టీ నాయకులు, యాంకర్స్ యుట్యూబ్ ఛానల్స్ అందరు జర్నలిస్ట్ లాగా వాళ్ళ సొంత వ్యూస్ ని న్యూస్ గా మార్చకుండా నియంత్రించండి . శాసనసభల్లో చట్టం తెస్తే తప్ప ఈ వ్యవస్థలో మార్పు ఆలోచించటం అత్యాసే. ఆస్తికి హద్దులున్నట్లు, ఆశకు కూడా హద్దులుండాలి. చట్టం ఎట్టి పరిస్తితుల్లో తేవాల్సిన అవసరం ఉందని ఒక శాసనకర్తగా నమ్ముతున్నాను . చట్టసభల్లోస్త్రీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పే రాజకీయ పార్టీలు తక్షణం ఈ మహిళల మీద వాడే భాష మీద స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను దీన్ని సరి చేయాల్సిన బాద్యత తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదం తో తెలుగు పేరు మీదుగా తెలుగు దేశం అని చదివిన మహానుభావుడు ఎన్టీఆర్ తెలుగు భాషా సభలకు మాట గేలుస్తుందని స్త్రీలమీద అగౌర్వం గా రాజకీయ నాయకుల బాషా ఇప్పుడు తెలుగు నేల పైనే తెలుగు వల్ల ఆత్మగౌరవం మంట గలుస్తుంటే చూస్తు ఉరు కుందామా మాట్లాడతాం ,
మీట్ ది ప్రెస్ లు రావాలి అసెంబ్లీ తీరు మారాలంటే మీడియాతీరు మారాల్సిందే. సభా సమరం అని హెడ్డింగ్ లు పెట్టటం ఆపాల్సిందే టెక్నాలజీ ఇంత పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మనం నాగరికత లేని రోజుల్లో బాష గొప్పా కదా వాళ్ళు కూడా వాడటం విస్మృతి బాషని వాడుతున్న ఎమ్మెల్యే లు మంత్రులు అనలిస్ట్‌లు యాంకర్స్ చాల బాదకరం దేశ భాష లందు తెలుగు లెస్స ఇలా ఇప్పుడు తెలుగు ఉందా నాయకులారా ప్రజలారా ఆలోచించండి. CP బ్రౌన్ తెలుగు నిఘంటువు రాస్తే ఆంధ్రుల తెలుగు భాషని అవమానించడం , ఆమానవీయం , దిగజారుడుతనం ,అభ్యంతరకరం ,వివేకం ,అరాచకం ,అర్దరహితం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భాష – భాష మీద దాడి కాదు, మన సంస్కృతిపై దాడి! ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికలపై, మీడియా చర్చలపై, అసెంబ్లీ సభలపై నడుస్తున్న భాషా వికృతత మనమంతా గమనిస్తున్నాం.
భాష మారాలి. తక్షణమే మారాలి. ఇది కేవలం మాటల విషయమే కాదు – ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన సమస్య. ఇప్పటి పరిస్థితి చూస్తే, అభిప్రాయ స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని కొంతమంది నాయకులు, విశ్లేషకులు, యాంకర్లు, సామాజిక మాధ్యమ వేదికలపై ఏదైనా మాట్లాడేస్తున్నారు. తెలుగు భాషపై తిట్ల రూపంలో ప్రదర్శించే విధానం చూసి ప్రతి తెలుగువాడికీ గాయమే.
తెలుగు భాష – ఇది ఐటాలియన్లకూ నచ్చింది, ఇది విజయనగర రాజులకు గర్వకారణం అయింది.
కానీ ఈ భాషను “బూతులు” మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించుకుంటున్న నాయకులు చూస్తే మనిషిగా తల వంచుకోవలసిన పరిస్థితి.
ఇప్పుడు ఉన్న పరిస్టితుల్లో తెలుగు భాషకు గౌరవం కల్పించాలి అన్నా తెగులు పట్టిన తెలుగుకి మళ్లీ పూర్వ వైభవం రావాలన్న ఎన్డీఏ సారధ్యంలోని చంద్రబాబునాయుడు గారితో సాధ్యం రేపు వర్షాకాల సమావేశాలలో దీని మీద చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని శాసనకర్తగా భావిస్తున్నా భాషని అగౌరపరచే గారి మీద కొత్త చట్టం తేవాలని కోరుకుంటున్నా.
వ్యాసకర్త
యార్లగడ్డ వెంకట్రావ్
ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసన సభ్యులు