తెలంగాణను భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ ఇబ్బంది పెట్టాయి. కామారెడ్డితో పాటు నిర్మల్, మెదక్ వంటి ప్రాంతాలు పాగా దెబ్బతిన్నాయి. అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు, మౌలిక వసతులు కూడా భారీగా ధ్వంసం అయ్యాయి. ప్రజలు విపత్తుల్లో ఉన్న రేవంత్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దానికి కారణంగా… ఇతర అంశాలపై రేవంత్ నిర్వహించిన సమీక్షలను ప్రస్తావిస్తున్నారు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా.. రేవంత్ పట్టించుకోలేదా?
అప్రమత్తంగానే ప్రభుత్వం
ప్రభుత్వం అంటే.. ముఖ్యమంత్రి కీ ఇస్తే కదలాలి లేకపోతే.. అంతే ఉండాలి అన్నట్లుగా ఉంటే అది చాలా లోపభూయిష్టమైన రూలింగే. ప్రభుత్వంలో ఎవరి పనులు వారు పక్కాగా చేసుకోవాలి. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం మంచి పనితీరు కనబరిచిందనే చెప్పాలి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు వచ్చిన తర్వాత వెంటనే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామారెడ్డి ఫ్లాష్ ఫ్లడ్స్ – ఎవరూ ఊహించని ఉత్పాతం
భారీ వర్షాలు వస్తాయని మూడు రోజుల ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి భారీ వర్షాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంది. అయితే కామారెడ్డిలో 500 మి.మి వర్షం ఒక్క రోజులో పడుతుందని ఎవరూ ఊహించలేదు. అంత వర్షం పడితే జరిగే నష్టం జరిగింది తెలుసు కాబట్టిజాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే లోతట్టు ప్రాంతాల్లో కొందరు ఇరుక్కుపోయారు. వారిని రక్షించారు.
ఇతర సమీక్షలు చేయకూడదా ?
అయితే రేవంత్.. ఇతర అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని.. స్పోర్ట్స్ యూనివర్శిటీ మీద, ఒలిపింక్స్ మీద, మూసీ మీద సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయనకు ప్రజల పట్ల బాధ్యత లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో రేవంత్.. వరద పరిస్థితిని స్వయంగా ఏరియల్ సర్వే చేసి.. సమీక్షలు రోజూ చేస్తూ అధికారవర్గానికి ఆదేశాలు ఇస్తున్నారని మాత్రం చెప్పడం లేదు. అయితే రేవంత్ పీఆర్ ఈ విషయంలో కాస్త వెనుకబడింది. కేవలం రేవంత్ వరద విషయంలో చేస్తున్న సమీక్షల్ని ఇస్తున్న ఆదేశాలను మాత్రమే హైలెట్ చేయాల్సింది పోయి.. ఇతర టాపిక్స్ కూ ప్రాధాన్యత ఇచ్చారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ప్రజల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేరు. కానీ అలాంటి భావన తెప్పించాలని విపక్షాలు ప్రయత్నిస్తాయి. వారి ట్రాప్ లో పడకుండా ఉండాల్సిన వ్యూహం పాటించాల్సింది.. సీఎం .. ఆయన కార్యకలాపాలను నియంత్రించేవారే.