టీఆర్ఎస్‌కు ఊహించని షాకిచ్చిన డీఎస్..!

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అలియాస్ డీఎస్ .. టీఆర్ఎస్‌కు మరోసారి షాక్ ఇచ్చారు. అయితే.. ఈ షాక్ రివర్స్ ది. ఆయన వెళ్లి కుమారుడు ఎంపీ అయిన భారతీయ జనతా పార్టీలోనో.. తాను ఉన్నత స్థాయికి ఎదిగేలా సహాయపడిన పార్టీ కాంగ్రెస్‌లోనే తిరిగి చేరలేదు. ఎవరూ ఊహించని విధంగా.. ఢిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో.. టీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ సమావేశం అయితే.. అనూహ్యంగా దానికి హాజరయ్యారు. తాను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడినేనని … పార్టీని వదిలి పెట్టే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పారు. డీఎస్‌ టీఆర్ఎస్‌కు దూరమయ్యారో… టీఆర్ఎస్సే… డీఎస్‌ను దూరం పెట్టిందో కానీ.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఓ రోజు నిజమాబాద్ నేతలంతా… కవిత నేతృత్వంలో సమావేశమై… డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారు. అప్పట్నుంచి… డీఎస్ టీఆర్ఎస్‌కు దూరమయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతారని.. బీజేపీ వైపు చూస్తున్నారని.. ప్రచారం జరిగింది. సోనియాతో ఒకటి, రెండు సార్లు భేటీ అయ్యారు కూడా. రామ్‌మాధవ్‌తోనూ చర్చించారని చెప్పుకున్నారు. కానీ తర్వాత సైలెంటయిపోయారు. హఠాత్తుగా.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్‌ హాజరవడంపై చర్చనీయాంశంగా మారింది. డీఎస్ ఎప్పుడూ.. టీఆర్ఎస్‌కు దూరం అవ్వాలని కోరుకోలేదని… నిజామాబాద్ నేతలే కుట్ర చేశారని.. ఆయన వర్గీయులు చెబుతూ ఉంటారు. అయితే…డీఎస్.. టీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలకు కారణమవుతున్నారని నిజామాబాద్ జిల్లా నేతలు మొత్తం తీర్మానించారు. నిజామాబాద్ టీఆర్ఎస్ వ్యవహారాలు.. కేసీఆర్ కుమార్తె కవిత చేతుల్లో ఉండటంతో.. పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే.. అనర్హతా వేటు నుంచి తప్పించుకునేదుకే.. డీఎస్.. పార్లమెంటరీ పార్టీ భేటీకి వచ్చారన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లో ఉంది.

కొన్ని నిబంధనల ప్రకారం… డీఎస్‌పై… అనర్హతా వేటు వేయాలన్న ఫిర్యాదును టీఆర్ఎస్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీలో జరిగింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలకు రాకపోవడాన్ని ఓ కారణంగా చూపించాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినందునే… డీఎస్ మీటింగ్ కు హాజరయ్యారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి టీఆర్ఎస్‌కు డీఎస్ ఓ రకంగా షాక్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close